Narendra Modi : ఏడాది పాటు బంగారం కొనద్దు.. ప్రధాని మోడీ పిలుపు.!
- పరేడ్ గ్రౌండ్స్ సభలో తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని
- విదేశీ మారకద్రవ్యాన్ని కాపాడాలని ప్రజలకు మోడీ విజ్ఞప్తి
- మెట్రో, ఈవీల వినియోగం పెంచాలని సూచన
- స్వదేశీ వస్తువుల వాడకంతోనే ఆత్మనిర్భర్ భారత్ సాధ్యమన్న ప్రధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Narendra Modi : తెలంగాణ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రసంగం చేశారు. “నా ప్రియమైన తెలంగాణ ప్రజలారా..” అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రజలు పాటించాల్సిన పలు అంశాలను ప్రస్తావించారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా విదేశీ మారకద్రవ్యాన్ని పొదుపు చేయాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ పరిస్థితుల వల్ల ఇంధన సంక్షోభం తలెత్తినప్పటికీ, దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకుండా జాగ్రత్త పడుతున్నామని ప్రధాని తెలిపారు. అయితే, విదేశీ ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు ప్రజలు కనీసం ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను తగ్గించుకోవాలని, అలాగే విదేశీ పర్యటనలను కూడా వాయిదా వేసుకోవాలని కోరారు. వీటితో పాటు వంట నూనెల వినియోగాన్ని పరిమితం చేయాలని సూచించారు. దేశం నుంచి బయటకు వెళ్లే ధనాన్ని అరికట్టడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని సాధించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
Also Read
ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు ప్రజలు మెట్రో సేవలను ఎక్కువగా వినియోగించుకోవాలని, ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపాలని ప్రధాని పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగంలో కూడా భారీ మార్పులు రావాలని ఆకాంక్షించారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే రసాయన ఎరువుల వల్ల భూమికి నష్టం వాటిల్లడమే కాకుండా దేశ సంపద కూడా కరిగిపోతోందని, అందుకే రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని కోరారు. వ్యవసాయంలో డీజిల్ ఇంజన్లకు బదులుగా సౌర శక్తితో నడిచే పంపు సెట్లను ప్రోత్సహిస్తున్నామని ఆయన వివరించారు.
స్వదేశీ వస్తువుల వినియోగంపై ప్రధాని ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశారు. స్వదేశీ గురించి మాట్లాడగానే చాలామంది కేవలం దీపావళి దీపాల గురించే ఆలోచిస్తారని, కేవలం మట్టి దీపాలు కొన్నంత మాత్రాన స్వదేశీని పూర్తిస్థాయిలో ప్రోత్సహించినట్లు కాదని స్పష్టం చేశారు. ప్రతి రోజూ వాడే వస్తువుల నుంచి వ్యవసాయ పరికరాల వరకు సాధ్యమైనంత వరకు భారత్‌లో తయారైన వస్తువులనే వాడాలని, అప్పుడే నిజమైన ఆత్మనిర్భర్ భారత్ సాధ్యమవుతుందని ప్రధాని మోడీ ఉద్ఘాటించారు. దేశాభివృద్ధి కోసం ప్రజలందరూ ఈ క్రమశిక్షణను పాటించాలని ఆయన కోరారు.
తాజావార్తలు
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
-
Raja Karuppasamy: ‘అంటే సుందరానికీ’ అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
-
Poco C95 Pro: పోకో C95 Pro లాంచ్.. 7500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా!
-
Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
-
CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!