డ్రగ్స్ కి బానిసలవుతున్న విద్యార్ధుల్ని ఆ మురికికూపం నుంచి బయటపడేసేందుకు పోలీసులు కఠినచర్యలకు దిగుతున్నారు. హైదరాబాద్ లో డ్రగ్స్ కు బానిసై ప్రాణాలు కోల్పోయిన బీటెక్ విద్యార్థి మరణంలో అనేక సంచలన విషయాలు బయటపడుతున్నాయి. నల్లకుంట పోలీస్ ల అదుపులో ముగ్గురు డ్రగ్స్ వాడుతున్న వ్యక్తులు వున్నారని తెలుస్తోంది.
సాప్ట్ వేర్ ఉద్యోగి రామకృష్ణ, గిటార్ టీచర్ నిఖిల్ జాషువా , బీటెక్ విద్యార్థి జీవన్ రెడ్డి లను కోర్టులో హాజరు పరుచనున్నారు పోలీసులు. పరారీలో ఉన్న లక్ష్మీపతి కోసం గాలిస్తున్నారు పోలీసులు. బీ టెక్ పూర్తి చేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ప్రేమ్ ఉపాధ్యాయ నుండి డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. డ్రగ్స్ కు బానిసలు అయిన సాప్ట్ వేర్ ఉద్యోగులు, ఆటో డ్రైవర్ లు, విద్యార్థులపై పోలీసులు ఫోకస్ పెట్టారు.
రంగంలోకి నార్కోటిక్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ దిగింది. నిందితుల సెల్ ఫోన్ డేటా ఆధారంగా …దర్యాప్తు జరుపుతున్నారు నల్లకుంట పోలీసులు. డ్రగ్స్ కు బానిసై మృతి చెందిన కేసులో సంచలన విషయాలు బయటపడడంతో తల్లిదండ్రులు ఉలిక్కిపడుతున్నారు. గోవా కేంద్రంగానే మొత్తం డ్రగ్స్ రాకెట్ నడిచినట్టు గుర్తించిన పోలీసులు ఆ దిశగా విచారిస్తున్నారు. ఐదుగురు హైదరాబాద్ బీటెక్ విద్యార్థులతో పాటు నలుగురు డీజే లు కలిసి డ్రగ్స్ పార్టీ నిర్వహించారు.
9 మందికి గోవాలో ఒక హోటల్ తో పాటు రిసార్ట్ లో డ్రగ్స్ సప్లై చేశారు. టాటూస్ ఉన్నవారికి డ్రగ్స్ సప్లై చేస్తున్నట్టు తేలింది. హైదరాబాద్ నుండి వెళ్ళే వారికి డ్రగ్స్ కోసం 15 డేన్స్ ఏర్పాటు చేశారు. 15 డేన్స్ లో నిరంతరం డ్రగ్స్ సప్లై అవుతుంటాయి. హోటల్స్, పబ్స్, రిసార్ట్స్ లో అర్ధ రాత్రిళ్ళు డ్రగ్స్ సప్లై అవుతాయి. ఇక పై హైదరాబాద్ నుండి గోవా వెళ్ళే వారికి పోలీసులు హెచ్చరికలు జారీచేశారు. గోవాలో డ్రగ్స్ తీసుకుంటున్న హైదరాబాద్ వాసుల పై నిఘా పెంచుతాం అంటున్నారు పోలీసులు. గోవా నుండి డ్రగ్స్ తీసుకొస్తున్న ఎవరినీ వదిలిపెట్టం అని, అనుమనాస్పద వ్యక్తుల పై కచ్చితంగా నిఘా ఉంచి బస్ లలో, వాహనాల్లో తనిఖీలు చేస్తామంటున్నారు.
గోవా లో జరిగే పార్టీలకు వెళ్లి డ్రగ్స్ కు బానిసలుగా మారుతున్నారు విద్యార్ధులు. ఈ కేసులో ఒక ప్రైవేటు ఉద్యోగితో పాటు గిటార్ ప్లేయర్ వున్నారు. ఆయీష్ ఆయిల్ ను ఎగుమతి చేసి సప్లయ్ చేస్తున్నాడు లక్ష్మీపతి అనే డ్రగ్స్ పెడ్లర్. డ్రగ్స్ మొత్తం తెలంగాణ రాష్టానికి వివిధ ప్రాంతాల నుండి వస్తున్నట్లు గుర్తించిన పోలీసులు అసలు మూలాలు గుర్తించే పనిలో పడ్డారు. డ్రగ్స్ వినియోగదారుల ను గుర్తించి వారి వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. గోవా లో డ్రగ్స్ విపరీతంగా కొనుగోలు అవుతున్నట్లు గుర్తించారు పోలీసులు. విద్యాసంస్థల్లోని సంపన్నుల పిల్లలు, ఖరీదైన డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. డ్రగ్స్ కొనుగోలు చేసిన వారి వివరాలు 94906 16688 కు కాల్ చేసి చెప్పాలని కోరుతున్నారు పోలీసులు.