NTV Telugu Site icon

Ragging: నల్గొండ మెడికల్ కాలేజీ హాస్టల్లో ర్యాగింగ్ పై నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆగ్రహం..

Anti Ragging

Anti Ragging

నల్గొండ మెడికల్ కాలేజీ హాస్టల్లో ర్యాగింగ్ పై నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ర్యాగింగ్ ఘటనపై పై పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. మీడియాలో వరస కథనాల ద్వారానే ర్యాగింగ్ విషయం తెలిసిందని నేషనల్ మెడికల్ కౌన్సిల్ లేఖలో పేర్కొంది. అసలు కాలేజీలో యాంటీ ర్యాగింగ్ కమిటీ ఉందా లేదా అని ప్రశ్నించింది. మరోవైపు ర్యాగింగ్ ఘటనలో ఇప్పటికే ఐదుగురు సీనియర్ వైద్య విద్యార్థులను ప్రిన్సిపల్ సస్పెండ్ చేశారు. వారిపై నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. భారత న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. తెలంగాణ ర్యాగింగ్ యాక్ట్ 1997 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Read Also: Womens Asian Champions Trophy 2024: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ విజేతగా భారత్..

ఈ ఘటనపై మెడికల్ కౌన్సిల్ జోక్యం చేసుకోవడంతో.. మెడికల్ కాలేజీలో యాంటీ ర్యాగింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ పై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. కేరళకు చెందిన జూనియర్‌ విద్యార్థులను 15 రోజుల క్రితం పలువురు సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్‌ చేశారు. దీనిపై బాధిత విద్యార్థులు ఈ నెల 12న కళాశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. తమతో ఇబ్బందికరమైన రీతిలో మాట్లాడుతూ, చెప్పిన పని చేయమని వేధిస్తున్నారని వారు పేర్కొన్నారు.

Read Also: Madhu Yashki Goud: దేశంలో ఆర్ఎస్ఎస్‌ను సేవాదళ్ ధీటుగా ఎదుర్కొంది..

Show comments