Nalgonda Bus Accident: నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మర్రిగూడ నార్కట్ పల్లి – అద్దంకి బైపాస్ వద్ద ఆరంజ్ ట్రావెల్స్ కు చెందిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 9 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాదు నుండి చెన్నై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఏర్పాటు చేసిన బారికేడ్లను తప్పించబోయి డివైడర్ ను ఢీ కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదానికి కారణం బస్సును అతి వేగంతో నడపడమే అని పోలీసులు తెలిపారు. రోడ్డుపై ఉన్న బ్యారికెడ్స్ ను డ్రైవర్ గమనించకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉండగా 9 మందికి గాయాలయ్యాయి. గాయాలైన వారికి ప్రాథమిక చికిత్స చేయించి గమ్యస్థానాలకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న నల్లగొండ రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Fish Egg: ఈ చేప గుడ్డు ధర అక్షరాలా రూ. 28 లక్షలు..!