Fish Egg: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆహారం కొన్ని లక్షలు ఖర్చవుతుందంటే నమ్ముతారా? ఈ ఆహారం బంగారం కంటే 50 రెట్లు ఎక్కువ అని తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. ఈ వంటకం పేరు అల్మాస్ కేవియర్. ఇది చాలా వంటలలో ఉపయోగిస్తారు. అసలు కేవియర్ అంటే ఏమిటి? కేవిన్ చేప గుడ్లు కదా అందులో అంత ప్రత్యేకత ఏముంది అనుకుంటాం. ఒక నివేదిక ప్రకారం, కేవియర్ అనేది స్టర్జన్ చేపల అండాశయాలలో కనిపించే గుడ్లు. అన్ని చేపల గుడ్లు కేవియర్ కాదు. స్టర్జన్ చేప గుడ్లను మాత్రమే కేవియర్ అంటారు.
Read also: Jammu Kashmir: భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం
కేవియర్ లో నాలుగు రకాలు ఉన్నాయి. అల్మాస్, బెలూగా, ఎసియేటర్, సెవ్రుగ అని రకాలు వుంటాయి. అన్ని రంగులు, రుచి భిన్నంగా ఉంటాయి. ప్రతి ఒక్కరికి భిన్నమైన ధర ఉంటుంది. వీటిలో అల్మాస్ చేప గుడ్లు అత్యంత ఖరీదైనది. అల్మాస్ కేవియర్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆహారం, దీని ధర కిలోకు USD 34,500. అంటే భారత కరెన్సీలో దీని ధర కిలో అక్షరాలా రూ. 28.74 లక్షలు. దీని అధిక ధరకు కారణం ఇది ఇరానియన్ బెలూగా స్టర్జన్ చేప నుండి లభిస్తుంది. కేవియర్ ఇరానియన్ బెలూగా చేప నుండి వచ్చింది. మొదటిది బెలూగా, రెండవది అల్మాస్ . బెలూగా కేవియర్ ధర కిలో 20 లక్షల రూపాయలు. అల్మాస్ కేవియర్ 100 ఏళ్లు పైబడిన అల్బినో బెలూగా స్టర్జన్ చేపల నుండి మాత్రమే వస్తుంది.
Read also: Indrakeeladri Temple: శ్రీలలితాత్రిపురసుందరీదేవి అలంకారంలో కనకదుర్గమ్మ దర్శనం
అల్మాస్ బెలూగా స్టర్జన్ ఇరాన్ సమీపంలోని కాస్పియన్ సముద్రం యొక్క పరిశుభ్రమైన భాగంలో కనుగొన్నారు. ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పేర్కొంది. ఇది అరుదైన చేప జాతి. అల్మాస్ కేవియర్ ఉప్పగా, వగరుగా ఉండే రుచితో ముత్యపు తెలుపు రంగులో ఉంటుంది. కేవియర్‌లో విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ ఎ పుష్కలంగా ఉన్నాయి, ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది అనేక తీవ్రమైన వ్యాధులను నివారించడానికి కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా… ఒక నివేదిక ప్రకారం కేవియర్ విటమిన్ B12 లో సమృద్ధిగా ఉంటుంది. ఇది.. శరీరానికి చాలా ప్రభావతం చూపుతుంది.
Read also: T20 World Cup 2024: చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్.. భారత్‌కు చావోరేవో! రికార్డ్స్ ఇవే
శరీరానికి అలసట , బలహీనతను తొలగించడంలో సహాయపడుతుంది. కేవియర్ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. ఇది తినడం వల్ల మీ మెదడు కణాలను రక్షించడంలో సహాయపడుతుంది. మహిళలకు గర్భధారణ సమయంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ చేప గుడ్లలో విటమిన్ సి, విటమిన్ ఇ , విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ గుడ్లు చాలా తీవ్రమైన వ్యాధులను నివారించడంలో కూడా సహాయపడుతుంది. అంతేకాదు దీనిని కేవియర్ సౌందర్య ఉత్పత్తులలో కూడా ఉపయోగిస్తారు. ఇది యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది, కాబట్టి ఇది మీ చర్మాన్ని చాలా కాలం పాటు ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది చర్మానికి చాలా ఉపయోగపడుతుంది.
T20 World Cup 2024: చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్.. భారత్‌కు చావోరేవో! రికార్డ్స్ ఇవే