నల్లగొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటించారు. మహాత్మ జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేశారు. త్వరలో రైతు భరోసా ఇవ్వబోతున్నామని తెలిపారు. ఇప్పటికే 18 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశాం.. మిగతా రుణమాఫీ ఈ నెల 30న చేస్తామన్నారు. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో కులగణనను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని అన్నారు. కులగణన నివేదికపై అసెంబ్లీలో సమగ్ర చర్చ జరుపుతామని చెప్పారు.
Read Also: Viral video : అమ్మాయిలతో పాటు భరతనాట్యం చేసిన ఏనుగు.. వీడియో వైరల్
త్వరలో నల్గొండలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో పాలనను ప్రధాని విమర్శించడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని మంత్రి అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో 500 రూపాయలకు సిలిండర్ ఎందుకు ఇవ్వడం లేదో ప్రధాని చెప్పాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పని చేస్తాం.. కానీ రాజకీయంగా కొట్లాడుతామని పేర్కొన్నారు.
Read Also: OTT : ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే
జనవరి చివరి నాటికి హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి విస్తరణ టెండర్ ప్రక్రియ ముగుస్తుంది.. ట్రిపుల్ ఆర్ శంకుస్థాపనకు ప్రధానిని లేదా నితిన్ గడ్కరిని ఆహ్వానిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. మరోవైపు.. బీఆర్ఎస్ పార్టీ శాసన సభ పక్ష నాయకుడు ఎవరో చెప్తే.. వాళ్లకే నేను సమాధానం చెప్తానన్నారు. కేసీఆర్ గురుకుల పాఠశాలలకు వస్తే ఆయనతో నేను కూడా కలిసి వెళ్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.