Naa Anveshana : సోషల్ మీడియా వేదికగా తెలుగు యూట్యూబర్స్ మధ్య యుద్ధం ముదురుతోంది. ప్రముఖ ట్రావెల్ బ్లాగర్ అన్వేష్, పాపులర్ యూట్యూబర్ ‘ఏయ్ జూడ్’ అజయ్ మధ్య మొదలైన వివాదం ఇప్పుడు తీవ్రస్థాయికి చేరింది. హిందూ దేవతలపై అన్వేష్ చేసినట్లుగా చెబుతున్న వ్యాఖ్యలు ఈ వివాదానికి కేంద్రబిందువుగా మారాయి. ప్రపంచ యాత్రికుడిగా గుర్తింపు తెచ్చుకున్న అన్వేష్, ఇటీవల హిందూ దేవతలను ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై హిందూ భక్తులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అన్వేష్‌పై ఇప్పటికే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ వివాదం ప్రభావం ఆయన యూట్యూబ్ ఛానెల్‌పై కూడా పడింది; రోజురోజుకూ ఆయన సబ్స్క్రైబర్స్ సంఖ్య భారీగా పడిపోతోంది.
Pickle 1 AR Glasses : మీ జీవితాన్నే గుర్తుంచుకునే ‘పికిల్ 1’ AR గ్లాసెస్.. !
ఈ వివాదంలోకి 41 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ప్రముఖ యూట్యూబర్ ‘ఏయ్ జూడ్’ అజయ్ ఎంట్రీ ఇచ్చారు. “నా సీతమ్మ, రాముడు, శివుడు, శ్రీవారు, ఆంజనేయుడి జోలికి వస్తే వదిలే ప్రసక్తి లేదు.. ఖబడ్దార్!” అంటూ అన్వేష్‌ను ఉద్దేశించి అజయ్ ఒక వీడియో విడుదల చేశారు. మొదట ఈ వీడియోను పోస్ట్ చేసి డిలీట్ చేసిన అజయ్, ఆ తర్వాత మళ్లీ రీ-అప్లోడ్ చేస్తూ అన్వేష్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు.
అజయ్ చేసిన వీడియోపై అన్వేష్ తీవ్రంగా మండిపడ్డారు. ఆ వీడియోను వెంటనే డిలీట్ చేయాలని, లేకపోతే నీ సంగతి, నీ తమ్ముడు ప్రణీత్ హనుమంతు సంగతి తేలుస్తానంటూ బహిరంగంగా బెదిరింపులకు దిగారు. గతంలో చిన్న పిల్లలపై అసభ్యకర వ్యాఖ్యల కేసులో ప్రణీత్ హనుమంతు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆ పాత విషయాలను ప్రస్తావిస్తూ అన్వేష్ చేసిన వ్యాఖ్యలు మంటలకు మరింత అజ్యం పోశాయి.
దీనికి ప్రతిగా అజయ్ స్పందిస్తూ.. “యుద్ధానికి ప్రూఫ్‌లతో రావాలి, నీ అంతు నేనే తేలుస్తా” అంటూ సవాల్ విసిరారు. ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఈ వ్యక్తిగత విమర్శలు, సవాళ్లు ఇప్పుడు తెలుగు యూట్యూబ్ కమ్యూనిటీలో హాట్ టాపిక్‌గా మారాయి. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో దైవ దూషణ చేయడం సరికాదని నెటిజన్లు అన్వేష్‌ను విమర్శిస్తుండగా, పాత కేసులను లాగడంపై మరికొందరు చర్చించుకుంటున్నారు. మొత్తానికి, ఈ ఇద్దరు టాప్ యూట్యూబర్స్ మధ్య మొదలైన ఈ ‘డిజిటల్ వార్’ ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.
Rammohan Naidu: శ్రీకాకుళం రైల్వే ప్రయాణీకుల కష్టాలకు చెక్.. ఫలించిన మంత్రి రామ్మోహన్ నాయుడు కృషి!