President Schedule Today: శీతాకాల విడిది కోసం భాగ్యనగరానికి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను సందర్శించారు. నిన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు భద్రాచలం రాములవారిని దర్శించారు. అనంతరం ఆసిఫాబాద్‌లో నూతనంగా నిర్మించిన ఏకలవ్య పాఠశాలను రాష్ట్రపతి ప్రారంభించారు. భద్రాద్రి దర్శనం అనంతరం భారత రాష్ట్రపతి దౌపది ముర్ము రామప్ప ఆలయాన్ని సందర్శించారు. చారిత్రక కట్టడమైన రామప్పకు ఆమె తొలిసారిగా వస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం కట్టు దట్టమైన చర్యలు చేపట్టింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక నేపథ్యంలో 2000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు అధికారులు చేపట్టారు. భద్రాచలంలో 144 సెక్షన్ అమలు చేశారు అధికారులు.
రాష్ట్రపతి ఇవాల ఉదయం 11.00-12.00 షేక్‌పేటలోని జి.నారాయణమ్మ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మహిళా కళాశాల సందర్శన. విద్యార్థులు, ఫ్యాకల్టీతో సమావేశం కానున్నారు. సాయంత్రం 5.00-6.00 శంషాబాద్‌లోని శ్రీరామ్‌నగర్‌లో సమైక్యతామూర్తి శ్రీ రామానుజాచార్య విగ్రహ సందర్శించనున్నారు. రాష్టప్రతి పర్యాటన నేపథ్యంలో శంషాబాద్ లో పూర్తి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. ఇక రేపు (డిసెంబర్ 30)న ఉదయం 10.00-11.00 రంగారెడ్డి జిల్లాలోని కన్హా శాంతి వనంలో శ్రీ రామచంద్ర మిషన్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన అంగన్వాడీ, ఆశా వర్కర్లను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం సాంస్కృతిక మంత్రిత్వశాఖ, శ్రీ రామ చంద్ర మిషన్ కలిసి చేపడుతున్న ‘హర్ దిల్ ధ్యాన్, హర్ దిన్ ధ్యాన్’ ప్రచార కార్యక్రమం ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 1.00గంటకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి విందు ఇవ్వనున్నారు.
Shamshabad Airport: ఎలా వస్తాయిరా ఈ ఐడియాలు.. టీ షర్ట్ లో బంగారం