Mulugu Doctors: డాక్టర్ సాహసాని సలామ్.. వాగులు దాటుకుంటూ వైద్యం..
- ములుగు జిల్లా వాజేడు మండలంలోని వైద్యుని సాహసం..
- గుట్టలు-వాగులు దాటి పెనుగోలు గిరిజన ప్రజలకు వైద్యం..
- మూడు వాగులు దాటి మూడు కొండలు ఎక్కి 16 కిలోమీటర్ల కాలినడకన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mulugu Doctors: ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులకు జ్వరం వచ్చినా, అనారోగ్యం వచ్చినా మందులే దిక్కు. దట్టమైన అడవుల్లో రవాణా సౌకర్యాలు లేవు.. వైద్యం అందించేందుకు వైద్యులు ముందుకు రావడం లేదు. కానీ, ఓ వైద్యాధికారి వృత్తి పట్ల మానవత్వంతో పాటు కరుణ, నిబద్ధత ప్రదర్శించారు. కొండలు, వాగులు దాటి వైద్య సేవలు అందించారు. ముగ్గురు గ్రామస్థుల సహాయంతో, వైద్య సిబ్బంది ప్రమాదకరమైన నడుము లోతు వాగులను దాటి ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని వైద్యుని సాహసానికి అందరూ సలామ్ చేస్తున్నారు.
Read also: Mallu Bhatti Vikramarka: రుణమాఫీ డబ్బులు రైతుల అప్పులకు మళ్లించొద్దు.. బ్యాంకర్లకు భట్టి వార్నింగ్..
Also Read
- CM Revanth Reddy : ఆడబిడ్డలకు డిసెంబర్లో చిలకపచ్చ చీరలు ఇస్తాం
- Bogatha Waterfalls : ఉగ్రరూపం దాల్చిన 'తెలంగాణ నయాగరా'.. సందర్శన నిలిపివేత!
- Mulugu : ప్రాణాలతో చెలగాటం.. వర్షాకాలంలో వాగు దాటేందుకు ఆదివాసీల అవస్థలు.!
- Medaram Jathara: నేటితో ముగియనున్న మేడారం మహా జాతర.. వన ప్రవేశం చేయనున్న సమ్మక్క- సారలమ్మ
ములుగు జిల్లా వాజేడు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి మధుకర్ వైద్యం అందజేస్తున్నారు. అయితే.. ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలోని గుట్టలపై ఉన్న పెనుగోలు గిరిజన ప్రజలు జర్వం బారిన పడ్డారని, వారికి సరైన వైద్యం అందడం లేదని చెప్పడంతో రోగుల కోసం రంగంలోకి దిగాడు వైద్యాధికారి మధుకర్. అంతేకాదు తన ఆధ్వర్యంలో వైద్య బృందమైన హెల్త్ అసిస్టెంట్లు చిన్న వెంకటేశ్వర్లు, కోరం శేఖర్, ల్యాబ్ టెక్నీషియన్ ఇర్ప రజినీకాంత్, సిబ్బంది లకన్, ప్రశాంత్, ఆశ వర్కర్ సమ్మక్క, గుమ్మడిదొడ్డి గ్రామస్తులు కారం ఆదినారాయణ, జజ్జేరి అశోక్ అనుతీసుకుని కాలినడకన పయనమయ్యారు. మూడు వాగులు దాటి మూడు కొండలు ఎక్కి 16 కిలోమీటర్ల కాలినడకన సాయంత్రానికి పెనుగోలు చేరుకున్నారు.
Read also: TG DSC Exams: నేడే తెలంగాణ డీఎస్సీ పరీక్షలు.. 10నిమిషాల ముందే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి..
అక్కడ నివసిస్తున్న 10 కుటుంబాలకు చెందిన 39 మందికి వైద్య పరీక్షలు చేశారు. జ్వరంతో బాధపడుతున్న ముగ్గురిని గుర్తించి మందులు అందజేశారు. గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ దోమలపై పిచికారీ చేశారు. వర్షాకాలంలో జ్వరాలపై జాగ్రత్తలను సూచించారు. మరి పెనుగోలు నుంచి తిరిగి పయనమయ్యారు. బుధవారం మధ్యాహ్నం పీహెచ్‌సీకి చేరుకున్నారు. అంతేకాకుండా.. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అయోధ్యపురం పీహెచ్సీ పరిధిలోని మట్టెవాడ శివారు తిమ్మాపురం గ్రామానికి వాగులు, వంకలు దాటి 8 కిలోమీటర్లు నడిచి బుధవారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు దేవేందర్, నరేష్, సిబ్బంది లోక్యానాయక్, అరుణ, హేమలత, రజిత, సర్దార్, లాలు, కవిత, ఆశ, సీతమ్మ పాల్గొన్నారు. ఈసందర్భంగా డాక్టర్ యమున మాట్లాడుతూ గిరిజనులు అటవీ ప్రాంతాల్లో ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలన్నారు. 42 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు.
Covid-19 : అమెరికా ప్రెసిడెంట్ బిడెన్ కు కోవిడ్ పాజిటివ్
తాజావార్తలు
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!