Site icon NTV Telugu

MP Kirankumar Reddy: శిశు పాలుడు ఫామ్ హౌస్‌లో పడుకుండు

Mp Chamala Kiran Kumar Reddy

Mp Chamala Kiran Kumar Reddy

MP Kirankumar Reddy: బీజేపీ మాజీ మంత్రి కేటీఆర్‌పై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పదేండ్లు అబద్దాలు ఆడిన శిశు పాలుడు పామ్ హౌస్ లో పడుకుండు.. కేటీఆర్ రెండు వేసుకొని ఖమ్మం పోయినట్లు ఉండు అని కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం తొందరగా ఐదేండ్లు పూర్తి కావాలని కేటీఆర్ తహతహాలాడుతుండు అని, రేవంత్ రెడ్డి లీకు వీరుడా.. గ్రీకు వీరుడా.. అనేది ఫామ్ హౌస్ కు పోయి మీ నాయనను అడుగు చెప్తడు అని ఆయన వ్యాఖ్యానించారు. వైట్ ఛాలెంజ్ చేసి వెంట్రుకలు, కిడ్నీ, లివర్ ఇస్తా అని ఇచ్చి ఉంటే ఈ డౌట్ వచ్చేది కాదని, కేదార్ తో హైలైట్ పబ్ పెట్టించింది ఎవరు అని అన్నారు.

AK-203 Rifle: భారత్‌ కా ‘షేర్’ AK-203.. నిమిషానికి 700 బుల్లెట్లు, 800 మీటర్ల రేంజ్..

అంతేకాకుండా.. ప్రగతి భవన్ లో ఉండి ప్రగతి లేని పాలన చేశారని, కనీసం మంత్రులకు చెప్పకుండా జీవోలు విడుదల చేశారన్నారు ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి. బనకచర్ల మీద చర్చ జరగలేదని రేవంత్ రెడ్డి ఆబద్దాలు చెప్పిండని కేటిఆర్ అంటుండని, రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల మీద చర్చ అని కేంద్ర జలశక్తి లేక విడుదల చేసిందన్నారు.

మీ అయ్య లెక్క అపెక్స్ మీటింగ్ కు పోకుండా తప్పించుకోలేదని, వ్యాపారం కోసం దోచుకుందామని ఫోన్ ట్యాప్ చేసిండు అనుకున్నా అని, సొంత చెల్లె ఫోన్ కూడా ట్యాప్ చేసిన దుర్మార్గుడు కేటీఆర్ అని ఆయన మండిపడ్డారు. లోకల్ బాడీ ఎన్నికలో 42 శాతం రిజర్వేషన్ ఆర్డినెన్స్ పాస్ అయినా కాకున్నా బీసీలకు 42శాతం ఇస్తా అని చెప్పగలవా?దమ్ముందా కేటీఆర్ నీకు? అని ఆయన సవాల్ విసిరారు

Instagram Auto Scroll: ఇక రీల్స్ స్వైప్ చేయాల్సిన అక్కర్లే.. ఆటోమేటిక్‌గా నెక్స్ట్ రీల్ చూసేయ్యండి!

Exit mobile version