AK-203 Rifle: భారత్ కా ‘షేర్’ AK-203.. నిమిషానికి 700 బుల్లెట్లు, 800 మీటర్ల రేంజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత సాయుధ దళాలు కొత్త బ్యాచ్ AK-203 అస్సాల్ట్ రైఫిల్స్‌ను పూర్తి స్థాయిలో పొందబోతున్నాయి. ఇది కలాష్నికోవ్ సిరీస్‌లో అత్యాధునికమైన వెర్షన్. ఈ రైఫిల్ నిమిషంలో 700 రౌండ్ల వరకు కాల్పులు జరపగలదు. 800 మీటర్ల రేంజ్‌ను కలిగి ఉంటుంది. ఇండో-రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (IRRPL) ఉత్తరప్రదేశ్‌లోని అమేథిలో దీన్ని తయారు చేస్తున్నారు. ఇది భారత్- రష్యా మధ్య జాయింట్ వెంచర్. ‘షేర్’ పేరుతో ఏకే-203 రైఫిళ్లను తయారు చేస్తోంది.
READ MORE: S*ex Scandal: థాయ్‌లాండ్‌ని కుదిపేస్తున్న బౌద్ధ సన్యాసుల సె*క్స్ కుంభకోణం..
Also Read
- Hyderabad Cyber Crime: 1980s ఫోటో ట్రెండ్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల బిగ్ వార్నింగ్..
- Mohammed Siraj: డీఎస్పీ మొహమ్మద్ సిరాజ్‌కు ప్రమోషన్.. హైదరాబాద్ రంజీ కెప్టెన్‌గా జట్టు పగ్గాలు.!
- Ram Lakshman Masters: 'ది ప్యారడైజ్' సెట్స్‌లో ఊహించని ప్రమాదం.. స్టంట్ మాస్టర్ చెయ్యి ఫ్రాక్చర్! రామ్-లక్ష్మణ్ సంచలనం.!
- Oracle Layoffs: ఏఐ డేటా సెంటర్ల కోసం భారీ ఖర్చు.. ఒరాకిల్‌లో మరోసారి పెద్ద ఎత్తున లేఆఫ్స్..?
రూ.5,200 కోట్ల ఒప్పందం కింద ఈ కంపెనీ సాయుధ దళాలకు ఆరు లక్షలకు పైగా ‘షేర్’ రైఫిళ్లను సరఫరా చేయాల్సి ఉంది. ఒప్పందం ప్రకారం.. 2032 అక్టోబరు నాటికి 6,01,427 ఏకే 203 రైఫిళ్లను అందజేయాల్సి ఉంది. కానీ, అనుకున్న సమయానికి 22 నెలల ముందు అంటే.. డిసెంబర్ 2030 నాటికి డెలివరీలను పూర్తి చేయాలని యోచిస్తున్నట్లు ఐఆర్‌ఆర్‌పిఎల్ చీఫ్ మేజర్ జనరల్ ఎస్‌కె శర్మ గురువారం తెలిపారు. “ఇప్పటివరకు దాదాపు 48,000 ‘షేర్’ రైఫిళ్లు పంపిణీ చేశాం. రాబోయే రెండు, మూడు వారాల్లో మరో 7,000 రైఫిళ్లు అందజేస్తాం. ఈ ఏడాది డిసెంబర్ నాటికి మరో 15,000 రైఫిళ్లు అందజేస్తాం..” అని ఆయన తెలిపారు.
READ MORE: Akshay Kumar : 700 మంది స్టంట్‌మెన్‌లకు అక్షయ్ కుమార్ సహాయం!
కాగా.. ఏకే 203.. ఏకే 47, ఏకే-57 నమూనాను పోలి ఉన్నా.. దానికంటే శక్తివంతమైనది.. అత్యాధునికమైనది. ఒక్కసారి ట్రిగ్గర్ నొక్కితే నిమిషానికి ఏడు వందల బుల్లెట్స్ దూసుకుపోతాయి. 800 మీటర్ల దూరంలోని లక్ష్యాన్ని కచ్చితత్వంతో చేధిస్తుంది. అలాగే ఇన్సాస్‌తో పోలిస్తే బరువు తక్కువ. ఇన్సాస్ రైఫిల్ మ్యాగజైన్ లేకుండానే నాలుగున్నర కిలోలుంటే.. ఏకే 203 మాత్రం మ్యాగజైన్‌తో కలిపి నాలుగు కిలోల బరువుంటుంది. దీంతో సైనికులకు భారంగా కాకుండా ఉంటుంది. అలాగే దీని వెనక భాగాన్ని మడిచే సౌకర్యం ఉండటంతో.. ఉపయోగించనప్పుడు పట్టుకోవడానికి, శరీరంపై ధరించడానికి సులభంగా ఉంటుంది. అంతేకాదు దీని మెకానిజం కూడా ఇన్సాస్‌తో పోలిస్తే చాలా అద్బుతమైంది. అత్యాధునికమైంది. ఇన్సాస్‌ను వినియోగించిన సైనికులు ఎక్కువగా చెప్పే కంప్లైంట్.. రైఫిల్ జామ్ కావడం.. ఏకే 203 వందశాతం సమర్ధవంతమైనది. ఎన్నిసార్లు వినియోగించినా.. బుల్లెట్స్ స్ర్టక్ అయ్యే సమస్యే లేదు. ఈ విషయంలో చేసిన ఎన్నో రకాల పరీక్షలను సమర్థవంతంగా దాటిందీ ఏకే 203.
తాజావార్తలు
-
Release Postpone : పెద్ద హీరోల సినిమా అంటే వాయిదా పడాల్సిందేనా?”
-
Hyderabad Cyber Crime: 1980s ఫోటో ట్రెండ్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల బిగ్ వార్నింగ్..
-
Mohammed Siraj: డీఎస్పీ మొహమ్మద్ సిరాజ్‌కు ప్రమోషన్.. హైదరాబాద్ రంజీ కెప్టెన్‌గా జట్టు పగ్గాలు.!
-
Ram Lakshman Masters: ‘ది ప్యారడైజ్’ సెట్స్‌లో ఊహించని ప్రమాదం.. స్టంట్ మాస్టర్ చెయ్యి ఫ్రాక్చర్! రామ్-లక్ష్మణ్ సంచలనం.!
-
Oracle Layoffs: ఏఐ డేటా సెంటర్ల కోసం భారీ ఖర్చు.. ఒరాకిల్‌లో మరోసారి పెద్ద ఎత్తున లేఆఫ్స్..?
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!