NTV Telugu Site icon

Motkupalli Narasimhulu: నేనేమీ సన్యాసిని కాదు.. ఎమ్మెల్యేగా పోటీ చేస్తా

Motkupalli Narsimhulu

Motkupalli Narsimhulu

Motkupalli Narasimhulu Says He Is Ready To Contest In Next Elections: ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా ఉండటానికి తానేమీ సన్యాసిని కానంటూ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు హాట్ కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను కచ్ఛితంగా పోటీ చేస్తానని అన్నారు. యాదాద్రి జిల్లా ఆలేరు మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడి నుండైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశిస్తే.. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి రెడీగా ఉన్నానన్నారు. అయితే.. ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది కేసీఆర్ నిర్ణయిస్తారని పేర్కొన్నారు. తనపై కేసీఆర్ ఆశీస్సులు కచ్ఛితంగా ఉంటాయన్నారు. ఆలేరు నియోజకవర్గం నుండి తాను 6సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని గుర్తు చేశారు. గతంలో తనకు ఏ పార్టీ కూడా అవకాశం ఇవ్వకపోయినా.. ఆలేరు ప్రజలు తనని గెలిపించారని గుర్తు చేసుకున్నారు. ఆలేరు నుండి కేసీఆర్ ఎవరికీ అవకాశం ఇచ్చినా.. బీఆర్ఎస్ పార్టీ కచ్ఛితంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాను ప్రజల కోసం పనిచేసిన వ్యక్తినని, ఇంట్లో ఖాళీగా కూర్చోవాలంటే కాళ్లు ఆగడం లేదని వెల్లడించారు. ఆలేరు ప్రజలకు ఇంకా చేయాల్సింది చాలా ఉందన్నారు. కాగా.. తన పుట్టినరోజు సందర్భంగా కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని మోత్కుపల్లి ప్రకటించిన విషయం తెలిసిందే.

Anand Devarakonda: అనసూయ- విజయ్ గొడవ.. కుక్కలు అలాగే కొట్టుకుంటాయి అన్న ఆనంద్

ఇదిలావుండగా.. ఆలేరులో 1983 నుంచి 1999 వరకు వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు మోత్కుపల్లి. 2009 ఎన్నికల్లో తుంగతుర్తి ఎస్సీ రిజర్వుడ్​ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. కానీ.. 2014లో మాత్రం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తెలంగాణలో టీడీపీ అడ్రస్​ గల్లంతు అవ్వడంతో.. 2018లో బీఎల్ఎఫ్​ తరపున ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. రెండేళ్ల క్రితం సీఎం కేసీఆర్ ఆహ్వానంతో బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. అప్పటి నుంచి పార్టీ హైకమాండ్ ఆయన్ను పక్కనపెట్టేసింది. ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న ఆయన.. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తన మనసులోని మాట బయటపెట్టారు.

Revanth Reddy: నా వ్యాఖ్యల్ని వక్రీకరించారు.. ఉచిత విద్యుత్ పేరుతో దోచుకుంటున్నారు