శామీర్‌పేటలో దారుణం చోటుచోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా తల్లికూతుళ్లు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తల్లి ప్రాణాలతో బయటపడగా.. కూతురు కోసం గాలిస్తున్నారు. ఈ సంఘటన శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలంలోని బొమ్మరసిపేట గ్రామానికి చెందిన తల్లికూతుళ్లు మోలుగు కాలమ్మ(50),మోలుగు కవిత(30) ఆత్మహత్య చేసుకునేందుకు బొమ్మరాసిపెట గ్రామంలోని అబ్బని కుంటలో దూకారు.
Also Read: AP High Court: విశాఖకు క్యాంపు కార్యాలయాల తరలింపు పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ
స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో తల్లి కాలమ్మను వెలికి తీశారు. కొన ఊపిరితో ఉన్న ఆమెను స్థానికంగా ఉన్న ఆర్‌వీఎం హాస్పిటల్‌కు తరలించారు. కూతురు కవిత కోసం ఇంకా గలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కాలమ్మను వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కుటుంబ కలహాలువల్లే ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని స్థానికులు, పోలోసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: Cyber Fraud: ఓ మహిళకు పార్ట్ టైం జాబ్ ఆఫర్ చేసి.. రూ. 3.37 లక్షలు కొట్టేసిన స్కామర్లు