Lucknow: ఓ మహిళకు పార్ట్‌టైం జాబ్ ఆఫర్ చేసిన స్కామర్లు ఆమె దగ్గర నుంచి ఏకంగా 3.37 లక్షల రూపాయలను కొట్టేశారు. ఈ సంఘటన లక్నోలో వెలుగులోకి వచ్చింది. నగరానికి చెందిన కుష్భు పాల్ అనే మహిళను స్కామర్లు పార్ట్ టైం జాబ్ పేరుతో మోసం చేశారు. నివాస్ పస్కర్ అనే వ్యక్తి ఆన్ లైన్ లో మహిళను పరిచయం చేసుకుని వీడియోలు, పోస్ట్ లకు లైక్ చేయడం వల్ల పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు అని బాధితురాలిని నమ్మించి మోసం చేశాడు.
Read Also: Guntur Kaaram: అమ్ము.. రమణగాడు.. గుర్తు పెట్టుకో.. గుంటూరు వస్తే పనికొస్తది
ఇక, నిందితుడు కుష్బు పాల్ ను ఓ వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ చేశాడు. ఆపై నకిలీ ట్రేడింగ్ వెబ్‌సైట్‌లో సైనింగ్ కావాలని బాధితురాలిని నమ్మించి.. బ్యాంక్ అకౌంట్‌ను కూడా లింక్ చేయాలని కుష్భు పాల్‌పై నివాస్ వస్కర్ ఒత్తిడి చేశాడు. దీంతో ఆమె ఖాతా నుంచి పెద్ద మొత్తంలో డబ్బును స్కామర్లు కొట్టేశారు. మోసపోయానని గుర్తించిన కుష్బూ పాల్ ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేసింది. ఇక, ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని అమీనాబాద్ ఎస్‌హెచ్ఓ సునీల్ కుమార్ ఆజాద్ తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేశాం.. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారని ఎస్‌హెచ్ఓ సునీల్ కుమార్ ఆజాద్ వెల్లడించారు.