Moinabad: మొయినాబాద్ మర్డర్ కేసు.. హత్యకు గురైన యువతి ముస్లింగా గుర్తింపు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Moinabad: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో జరిగిన యువతి మర్డర్ కేసు నేటితో నాల్గవ రోజుకు చేరుకుంది. మొయినాబాద్ మర్డర్ కేసు ఒక్కసారిగా నగరం ఉలిక్కిపడేలా చేసింది. పోలీసులకు మరో దిశ కేసును చేధించనున్నట్లు కనిపిస్తుంది. అయితే పోలీసులకు ఈ మర్దర్ కేసులో కాస్త పురోగతి కనిపించింది. హత్య గురైన యువతి మల్లెపల్లి కి చెందిన ముస్లిం యువతి థైసీన్ గా గుర్తించారు. ఆ యువతిని వేరేచోట హత్య చేసి ఇక్కడకు తీసుకువచ్చి పెట్రోల్ పోసి కాల్చినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హంతకుల కోసం వేట కొనసాగుతున్నారు. అయితే మర్డర్ కేసు ఛేదించేందుకు అక్కడ వున్న సీసీ కెమెరాలు, టెక్నికల్ ఎవిడెన్స్, యువతి మొబైల్ ఫోన్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. యువతి మర్డర్ కేస్ దర్యాప్తుకు 7 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. మర్డర్ స్పాట్ లో మరిన్ని ఆధారాల కోసం పోలీసులు, క్లూస్ టీమ్ సెర్చింగ్ చేస్తోంది. యువతిని ఎక్కడో చంపి బైక్ మీద తీసుకువచ్చి ఇక్కడ కాల్చినట్లు పోలీసులు అనుమానం.
Read also: Hanuman: లెక్కల్ని తారుమారు చేస్తున్న సూపర్ హీరో…
Also Read
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
- Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
మొయినాబాద్ మండలం బాకారం గ్రామ శివారులోని డ్రీమ్‌వ్యాలీ రిసార్ట్‌కు వెళ్తుండగా సోమవారం పట్టపగలు ఓ యువతిని హత్య చేసి దహనం చేశారు. మంటల్లో కాలిపోతున్న గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానిక రైతులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికి మృతదేహాలు కాలిపోయి, రైతుల సాయంతో మంటలను ఆర్పివేశారు. అప్పటి నుంచి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో సగం కాలిపోయిన సెల్‌ఫోన్‌ను గుర్తించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. మృతుడికి 25 ఏళ్లు ఉంటుందని భావిస్తున్నారు. ఈ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది.
Read also: Atal Setu : నేడు ప్రధాని మోడీ ప్రారంభించబోయే ‘అటల్ సేతు’ విశేషాలివే
ఏడు బృందాలుగా ఏర్పడి విచారించగా.. వివరాలు తెలియరాలేదు. బాధితురాలి ఫోన్ దొరికినా సిమ్‌కార్డు తొలగించడంతో మొయినాబాద్ చుట్టుపక్కల ఏ పోలీస్ స్టేషన్లోనూ మిస్సింగ్ ఫిర్యాదు రాకపోవడంతో కేసు ఛేదించడం కష్టంగా మారింది. మొబైల్ ఫోన్ పూర్తిగా కాలిపోవడంతో పోలీసులు సిమ్ కార్డు ఐఎంఈ నంబర్‌ను గుర్తించడం ప్రారంభించారు. ఆధారాలు లేకపోవడంతో విచారణలో కాస్త జాప్యం జరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం యువతి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీలో ఉంచారు. డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ పరిసరాలు, సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరిన్ని ఆధారాల కోసం పోలీసులు, క్లూస్ టీమ్ హత్య జరిగిన ప్రాంతంలో గాలిస్తున్నారు. యువతి ప్యాంట్ వెనుక జేబులో స్టిక్కర్ కనిపించింది. నిందితులు ఓ దారి నుంచి వచ్చి మరో దారిలో వెళ్లి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
Hanuman: లెక్కల్ని తారుమారు చేస్తున్న సూపర్ హీరో…
తాజావార్తలు
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!