Site icon NTV Telugu

Moinabad Drug Case : మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో కొనసాగుతున్న విచారణ..

Moinabad

Moinabad

మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన మొయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారం ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. అజీజ్ నగర్‌లోని సర్వే నెంబర్ 177/33 పరిధిలో ఉన్న సుమారు 2.20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఫామ్ హౌస్ పూర్తిగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూమిలో కట్టినట్లు రెవెన్యూ అధికారులు జరిపిన విచారణలో నిర్ధారణ అయ్యింది. 2006లో ఈ భూమి రోహిత్ రెడ్డి తండ్రి విఠల్ రెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్ అయినట్లు రికార్డులు చెబుతున్నప్పటికీ, భూభారతి రికార్డుల ప్రకారం అది జంగయ్య అనే వ్యక్తి పేరు మీద ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అసలు ప్రభుత్వానికి చెందిన అసైన్డ్ భూమిపై రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందనే అంశంపై ప్రస్తుతం రెవెన్యూ , పోలీస్ యంత్రాంగం లోతుగా ఆరా తీస్తోంది.

Prakash Raj: ‘ధురందర్ 2’పై ప్రకాష్ రాజ్ వివాదాస్పద ట్వీట్.. అల్లు అర్జున్, ఎన్టీఆర్, విజయ్, మహేశ్‌పై సెటైర్లు!

ఈ అక్రమ నిర్మాణంపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసిన రెవెన్యూ శాఖ, ఫామ్ హౌస్‌ను సీజ్ చేయాల్సిందిగా ఇప్పటికే అధికారులకు నివేదిక అందించింది. పోలీసుల విచారణలో భాగంగా ప్రస్తుతం ఈ ఫామ్ హౌస్ వారి కస్టడీలోనే ఉంది. అక్కడికి పార్టీ కోసం వచ్చిన వారి విలాసవంతమైన వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఐదు లగ్జరీ కార్లను (డిఫెండర్, వోల్వో, ఫోక్స్ వ్యాగన్, బెంజ్, రేంజ్ రోవర్) సీజ్ చేసి, ఆ సమాచారాన్ని కోర్టుకు నివేదించారు. పార్టీకి హాజరైన వారు తమ వాహనాలను అక్కడే వదిలేసి వెళ్లడంతో పోలీసులు వాటిని సీజ్ చేసి విచారణను వేగవంతం చేశారు. త్వరలోనే ఈ ఫామ్ హౌస్ సీజ్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది.

Exit mobile version