Cyclone: బంగాళాఖాతంలో వాయుగుండం.. తెలంగాణలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం..
- బలపడిన దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం..
- నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా ఏర్పడింది..
- తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyclone: దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా ఏర్పడింది. దీంతో హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాష్ట్ర ప్రజలకు అలర్ట్ చేసింది. వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణ రాష్ట్రానికి నేడు రేపు వర్షాలు పడాతయని వెల్లడించింది. పూర్తిగా నైరుతి రుతుపవనాలు తిరోగమించాయని తెలిపింది. రాష్ట్రంలోకి ఈశాన్య రుతుపవనాలు ఎంటర్ అయ్యాయని తెలిపింది. ఈశాన్య రుతుపవనాల సమయంలో ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈశాన్య రుతుపవనాల రాక సమయంలో తీవ్ర ఉక్కపోత వాతావరణం నెలకొంటుందని వెల్లడించింది. రాష్ట్రంలో పలు చోట్ల ఇప్పటికే 34 డిగ్రీల పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. ఏపీకి సమీపాన ఉన్న తెలంగాణ జిల్లాలకు వాయుగుండం ప్రభావం ఉంటుండనుంది. దీని ప్రభావంతో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది.
Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Also Read
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఇవాళ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. కాగా, కృష్ణా బేసిన్‌లో కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర, కృష్ణా నదులకు స్వల్పంగా వరద కొనసాగుతోంది. కర్ణాటకలోని నారాయణపూర్ ప్రాజెక్టుకు బుధవారం 55 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, 50 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు 40 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 73,573 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.1 అడుగులకు చేరుకుంది. నాగార్జునసాగర్‌కు 67,676 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో (312 టీఎంసీలు) 4 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 32,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
Tollywood : అనుకున్నట్టుగానే ఆ సినిమాకు ‘A’ సర్టిఫికెట్..
తాజావార్తలు
-
Coolpad Wide-Screen: రూ.13 వేలకే Coolpad వైడ్‌స్క్రీన్ ఫోన్? 16:10 డిస్ప్లే, Helio G99 చిప్సెట్తో రానుందా?
-
January 12 Vidudala: సైలెంట్‌గా ఊటీ చేరుకున్న అనిల్ రావిపూడి టీమ్..!
-
Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
-
Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
-
El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి సీఎస్.. రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!