NTV Telugu Site icon

MLC Kavitha: అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్తాం

Kavitha Dhilhi

Kavitha Dhilhi

MLC Kavitha: దర్యాప్తు సంస్థలు మహిళలను విచారించే పద్ధతిపై అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్తామన్నారు. ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఢిల్లీలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఈడీ నాకు నోటీసులు ఇచ్చింది. దానికి నేను పూర్తీగా సహరిస్తానని అన్నారు. ఈడీ ఎందుకింత హడావిడీగా వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదని మండిపడ్డారు. కావాలంటే నిందితుల్ని ఇంటికి తీసుకొచ్చి విచారించమని కోరా అని అన్నారు. దర్యాప్తు సంస్థలు మహిళ ఇంటికొచ్చి విచారించాలన్నది చట్టం చెబుతోందని గుర్తు చేశారు. కానీ ఈడీ మా విజ్ఞప్తిని పట్టింఉకోలేదని స్పష్టం చేశారు. ఇది నా ఒక్క సమస్య కాదని, తెలంగాణ నేతల్ని వేధించడం కేంద్రానికి అలవాటైపోయిందని మండిపడ్డారు. అయినా కొన్ని కారణ వల్ల 11న వస్తానని చెప్పానని అన్నారు. అధికారంలో లేని రాష్ట్రాల్లో మోడీ కంటే ముందు ఈడీ వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ విచారణను ఎదుర్కొంటా.. నాతోపాటు ఎవర్ని విచారించినా నాకు ఇబ్బంది లేదన్నారు కవిత.

Read also: Bhatti Vikramarkaa: నీకు అవమానం జరిగితే తెలంగాణకు అవమానం జరిగినట్టా..!

ఈడీ దర్యాప్తుకు వంద శాతం సహకరిస్తామన్నారు. నాకు భయమెందుకు? నేనేం తప్పు చేయలేదన్నారు. దర్యాప్తు సంస్థలు మహిళ ఇంటికొచ్చి విచారించాలని చట్టం చెబుతోంది.. దర్యాప్తు సంస్థలు మహిళల్ని విచారించే పద్ధతిపై అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్తాం.. ఈడీ ఎందుకింత హడావిడిగా వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదు.. దర్యాప్తును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎందుకు చేయరు? అని ప్రశ్నించారు. నిందితులతో కలిపి ప్రశ్నించాలనుకుంటే నన్ను వీడియో కాన్ఫరెన్స్‌లో విచారించండి అన్నారు. బీజేపీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోంది.. మోడీ వైఫల్యాలను కప్పిపుచ్చడానికే ప్రతిపక్షాలపై కేసులు.. మోడీ వన్ నేషన్, వన్ ఫ్రెండ్ అనే కొత్త స్కీమ్ తెచ్చారు.. మోడీ బయటే కాదు, పార్లమెంట్‌లోనూ అబద్ధాలు చెప్తున్నారు.రేపు జంతర్‌ మంతర్ దీక్షలో 5 వందల మంది పాల్గొంటారని అన్నారు. 27 ఏళ్లుగా మహిళా బిల్లు కోసం చర్చ జరుగుతోందని, రాజ్యసభలో మహిళా బిల్లు తెచ్చిన సోనియాకు సెల్యూట్.. మహిళా బిల్లును కోల్డ్ స్టోరేజ్‌లో పడేశారని అన్నారు. రేపు జంతర్‌ మంతర్ వద్ద మహిళా బిల్లు కోసం ధర్నా చేస్తున్నామని అధికారంలోకి వస్తే మహిళా బిల్లు తెస్తామని 2014, 2018లో మోడీ మాటిచ్చారని గుర్తు చేశారు.
Minister KTR: కవితకు ఇచ్చింది ఈడీ సమన్లు కాదు మోడీ సమన్లు