Site icon NTV Telugu

MLC Kavitha: తెలంగాణ పథకాలను అన్ని రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయి

Mlc Kavitha On Congress

Mlc Kavitha On Congress

MLC Kavitha Says Other States Copying Telangana Schemes: తెలంగాణ పథకాలను అన్ని రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సాగనీటి దినోత్సవాల్లో ఆమె మాట్లాడుతూ.. దశాబ్ది ఉత్సవాలపై కాంగ్రేస్ పార్టీ తప్పుడు ప్రచారం చేయడం ఏమాత్రం సరైంది కాదని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేకే.. కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. చెరువుల పండగతో గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొందని, తెలంగాణ సంస్కృతిని చాటి చెప్తున్నాయని అన్నారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి సొంతూరులో పింఛన్ ఇవ్వడానికి ఆలోచించేవారని దుయ్యబట్టారు. వడ్డించేవాళ్ళు మన వాళ్ళు ఉండటం వల్లే.. సంక్షేమ పథకాలు అమలు, ప్రతి ఇంటికి చేరుతున్నాయన్నారు. కాంగ్రెస్ నాయకులు కేవలం లొల్లి పెట్టడానికే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

Minister Kottu Satyanarayana: పవన్‌పై మంత్రి కొట్టు సంచలన వ్యాఖ్యలు.. కాపుల భావన అదే.!

నిజామాబాద్ ప్రజలు కేవలం కేసీఆర్ కటౌట్ చూసి ఓటు వేశారని, ఆయన ఖ్యాతి ఎవరెస్ట్ అంటూ ఎమ్మెల్సీ కవిత కొనియాడారు. పదేళ్లలో సాధించిన ప్రగతిని సమీక్ష చేయడం కోసమే.. ఈ దశాబ్ది వేడుకలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. చేసిన అభివృద్ధిని చెప్పే సత్తా కేసీఆర్‌కి మాత్రమే ఉందన్నారు. సమైక్య రాష్ట్రంలో, సమైక్య పాలనలో కరువు ఉండేదని.. కానీ ఇప్పుడు ఎక్కడా చూసినా పచ్చని పైర్లు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. కేసీఆర్ అంటే కాలువలు, చెక్ డ్యామ్‌లు, రిజర్వాయర్లు అని అభివర్ణించిన ఆమె.. అతి తక్కువ కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడం వల్ల, కల్వకుంట్ల చంద్రశేఖర రావు అని కాకుండా కాళేశ్వరం చంద్రశేఖర రావు అని పిలవాలి కోరారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో కాలువలు కట్టకుండానే వేల కోట్లు దండుకున్నారని ఆరోపించారు. బీజేపీ కూడా చేసిందేమీ లేదని విరుచుకుపడిన ఎమ్మెల్సీ కవిత.. నిజమైన దేశ భక్తుడు ఎవరైనా ఉన్నారంటే, అది కేవలం కేసీఆర్ మాత్రమేనని చెప్పుకొచ్చారు.

Swimming Pool Death: యువకుడ్ని మింగేసిన స్విమ్మింగ్‌పూల్.. కారణమదే!

Exit mobile version