MLC Kavitha: ప్రియాంక గాంధీ ఫ్యామిలీ పాలిటిక్స్ గురించి మాట్లాడడం ఈ ఎన్నికల ప్రచారంలో అతి పెద్ద జోక్ అని ఎమ్మెల్సీ కవిత సెటైర్ వేశారు. మోతీలాల్ నెహ్రూ కొడుకు, జవహర్ లాల్ కూతురు, ఇందిర గాంధీ కొడుకు, రాజీవ్ గాంధీ కూతురు ఇది కాదా కుటుంబ పాలనా? అని గుర్తు చేశారు. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల వ్యాఖ్యలు సత్యదూరం అన్నారు. స్క్రిప్ట్ ను సరిచూసుకోవాలని సూచించారు. కాళేశ్వరం మిషన్ భగీరథ రెండింటి ఖర్చు లక్ష కోట్లు అన్నారు. మరి లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది? అని ప్రశ్నించారు. పదే పదే అవే మాటలు మాట్లాడితే అభాసు పాలవుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 350 కోట్లతో ఆర్మూర్ లో లిఫ్ట్ లు తెచ్చామని అన్నారు. కరప్షన్ మీరు చేశారు కాబట్టే.. రైతుల కళ్ళలో నాడు కన్నీరు అన్నారు. ధరణి బంగాళాఖాతంలో పారేస్తే భూమి హక్కు ఎవరిది అనేది ఎలా తెలియాలి రైతు బందు ఎవరికీ వస్తుంది? అని ప్రశ్నించారు. పొరపాటున కాంగ్రెస్ వస్తె మూడు గంటకే కరెంట్ వస్తుందని కవిత తెలిపారు.
తెలంగాణ ద్రోహులకు తెలంగాణ ప్రేమికులకు మధ్య యుద్ధం.. కాంగ్రెస్ పార్టీ వల్లనే కష్టాలు పడ్డమన్నారు. ఆత్మ బలిదానాలు జరిగాయని, పార్లమెంట్ లో తెలంగాణ సమస్యల గురుంచి ఒక్క సారి కూడా రాహుల్ మాట్లాడలేదని తెలిపారు. ప్రజలు ఆలోచించాలని గుర్తు చేశారు. అమ్మకు అన్నం పెట్టని వారు చిన్నమ్మ కు బంగారు గాజులు చేయిస్తారా? అని వ్యంగాస్త్రం వేశారు. సింగరేణి ని నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూతపడే పరిస్తితి వస్తె సీఎం కేసీఆర్ సింగరేణిలో సంస్కరణలు తీసుకొచ్చి ఊపిరి పోశారని గుర్తు చేశారు. మోడీయే మా పథకాలు కాపీ కొడుతున్నారని మండిపడ్డారు. ప్రియాంక కుటుంబ పాలన అంటే హాస్యాస్పదంగా ఉందని అన్నారు.
Konatireddy: కాంగ్రెస్ సీట్లు సెంచరీ కొట్టిన ఆశ్చర్యపోనవసరం లేదు.. కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు