MLC Jeevan Reddy: తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముత్యంపేట చెక్కెర ఫ్యాక్టరీ మూతపడిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భావంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ సభను విజవంతం చేసిన కార్యకర్తలకు ధాన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడిదారుల, నియంతృత్వ పాలన సాగుతుందని అన్నారు. గడిచిన 9 సంవత్సరాల కాలం లోSC,ST లా కు కేటాయించిన 30, 40 వెల కోట్ల నిధులను ప్రభుత్వం దారి మల్లించిందన్నారు. బీసీలకు కల్పించాల్సిన రిజర్వేషన్ ల పై ప్రభత్వానికి చిత్త శుద్ధి లేదన్నారు. బీసీ లో జనగణన జరిగితే జనాభా ప్రాతిపదికన బీసీ కు నిధులు కేటాయించాబడి హక్కులను కాపాడకలుగుతామని అన్నారు.
సమగ్ర కుటుంబ సర్వే బహిర్గతం అవుతే.. బీసీ ల జనాభా బయటపాడుతుందన్నారు. EWS రిజర్వేషన్ అమలు కోసం రాజ్యాంగ సవరణ చేసి అగ్రవర్ణాలకు EWS రిజర్వేషన్ కల్పించారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముత్యం పేట చెక్కెర ఫ్యాక్టరీ మూతపడిందని కీలక వ్యాఖ్యలు చేశారు. చెక్కర ఫ్యాక్టరీలో ప్రైవేట్ వాటా 51 శాతం తెల్చాలని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెక్కర ఫ్యాక్టరీ ని తెర్పిస్తామన్నారు. కవిత మీ నాన్నని అడుగు సమగ్రకుటుంబ సర్వేను అని అన్నారు. 2018లో చట్టసభలకు ఎంపికైన బీసీ ప్రజా ప్రతినిధులు ఇచ్చిన నివేదికలను బహిర్గతం చేయమని అని తెలిపారు.
Raviteja: టైగర్ కి పెరుగుతున్న థియేటర్ కౌంట్… విక్రమార్కుడు తర్వాత ఇదే ఫస్ట్ టైమ్