NTV Telugu Site icon

MLC Jeevan Reddy : కేసీఆర్‌ స్వయంకృపరాధమే అధికారం కోల్పోవడానికి ప్రధాన కారణం

Mlc Jeevan Reddy

Mlc Jeevan Reddy

కేసీఆర్‌ అధికారం కోల్పోవడానికి ప్రధాన కారణం కేసీఆర్‌ స్వయంకృపరాధమే అని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో మీడియ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కి ప్రధాన భాద్యుడు కేసీఆర్‌ అని ఆయన ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్‌ ఇరుక్కాపోతాడని, కేంద్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసు ను CBI విచారణ చేపట్టాలన్నారు. ప్రధానమంత్రి మోడీ దేశం లో మత్తవిద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని, ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ అని ఆయన మండిపడ్డారు.

దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రాగానే EWS రిజర్వేషన్లలో మార్పులు చేస్తామని, అన్ని వర్గాల్లో ఆర్థిక వెనుకబడిన వారికి EWS రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు జీవన్‌ రెడ్డి. గత 10 సంవత్సరాలలో హిందూ సమాజానికి మోడీ చేసిందేమి లేదని, SC, ST, BC ల కు అన్యాయం చేస్తుంది నరేంద్ర మోడీ అని ఆయన అన్నారు. హిందువుల మెప్పు పొందే ప్రయత్నం లో భాగంగా ముస్లింల రిజర్వేషన్ లు రద్దు చేస్తామని బీజేపీ చెప్తుందన్నారు. EWS లో ముస్లిం లు రిజర్వేషన్లు పొందుతున్నారని, కులం,మతం అనే బేధం లేకుండా EWS ను అన్ని వర్గాల్లో ఆర్థికంగా వెనుకపడ్డ వారికీ రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలన్నారు. EWS రిజర్వేషన్లతో దళితులు, బలహిన వర్గాలు అన్యాయానికి గురవుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.