MLC Jeevan Reddy: బీసీల అభివృద్ధికి ఇప్పటివరకు ఒక్క యాక్షన్ ప్లాన్ లేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్ది కాలంలో శతాబ్ది అభివృద్ధి అనేది ఎన్నికల స్టంట్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ హయాంలో రాష్ట్ర అభివృద్ధి కాదని అన్నారు. రాష్ట్రాన్ని వంద సంవత్సరాల వెనక్కి వెళ్ళిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని అన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని ఆరోపించారు. రాష్ట్రం వచ్చాక కల్వకుంట్ల కుటుంబమే బాగుపడిందని, కేసీఆర్ చేసే అభివృద్ధి ప్రకటనలకే పరిమితం అవుతుందని, ఆచరణలో లేదని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. దళిత బందు స్కీమ్ ప్రకటనలో ఆర్భాటం చేసిన కేసీఆర్.. స్కీమ్ అమలులో చిత్తశుద్ది ప్రదర్శించ లేదని అన్నారు. బడ్జెట్ లో చేటాయించిన కేటాయింపులు ఒక్క పైసా ఖర్చు చేయలేదని ఆరోపించారు. 2022 – 23 బడ్జెట్ కేటాయింపులలో దళిత బందు కేటాయింపులు ఖర్చు శూన్యమని తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం ఏమైంది? అని ప్రశ్నించారు. 5 లక్షలతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణమని చెప్పారు.. ఇప్పుడు దాన్ని 3 లక్షలకు తగ్గించి ఇస్తామంటున్నారని గుర్తు చేశారు.
కేసీఆర్ ఇచ్చిన హామీలు ప్రజలు మార్చి పోతారని అనుకుంటున్నారా? రోజుకు ఒక కొత్త తరహా వాగ్దానాలతో ప్రజలను మభ్యపెడుతూ కాలం వెళ్లదీస్తున్నారని మండిపడ్డారు. దళిత బందు లబ్దిదారుల ఎంపిక .. స్వంత స్థలంలో ఇళ్ళ నిర్మాణం కు ఇప్పటి వరకు మార్గదర్శకాలు లేవని అన్నారు. క్యాబినెట్ సమావేశంలో వీటిపై అసలు చర్చనే లేదని మండిపడ్డారు. బీసీల అభివృద్ధికి ఇప్పటివరకు ఒక యాక్షన్ ప్లాన్ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ ఉద్యోగాల భర్తీ పై ఒక్క అడుగు ముందుకు పడలేదని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు బడ్జెట్ లో కేటాయించిన నిధుల్లో 50 వేల కోట్లు క్యారీ ఫార్వర్డ్ చేశారని తీవ్రంగా ఆరోపించారు. ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? అని ప్రశ్నించారు. గిరిజన బందు అన్నారు .. ఇప్పటి వరకు దాని ఉసే లేదని మండిపడ్డారు. చేసింది చెబితే చాలు అని కేసీఆర్ అంటున్నారు.. ఏం చేశారని చెబుతారు? అని మండిపడ్డారు. రాష్ట్రంలో కేసీఆర్ మాటలకు కాలం చెల్లిందని, అందుకే ఇప్పుడు మహారాష్ట్ర మీద పడ్డారని ఆరోపించారు. ప్రజలు ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించాలి .. కేసీఆర్ మాయ మాటలు నమ్మవద్దని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Malkajgiri Crime: కాళ్ల పారాణి ఆరకముందే.. నవవధువు ఆత్మహత్య