NTV Telugu Site icon

P.Sudarshan Reddy: అమ్మా షర్మిలా.. రెండురోజుల ముందు తగిలిన గాయం ఏమైంది!

Peddi Sudarshan Reddy

Peddi Sudarshan Reddy

P.Sudarshan Reddy: నర్సంపేటలో వైఎస్‌ఆర్‌ టీపీ అధినేత్రి షర్మిల పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడంతో ఉత్కంఠ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.. వాగ్వాదాల మధ్య చివరికి షర్మిలను తను కారులో ఉండగానే పోలీసులు క్రేన్‌ సహాయంతో పోలీస్టేషన్‌ కు తరలించారు. ఈ ఉత్కంఠ వాతావరణంలో షర్మిలకు గాయాలయ్యాయి. దీంతో ఆమె మాట్లాడుతూ.. తనపై దాడి చేస్తారా? అంటూ వ్యాఖ్యానించింది. దీనిపై పలు టీవీల్లో ఆమె మొఖం చూపిస్తూ ట్రోల్‌ కూడా చేశారు. అయితే ఈ వార్తపై ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల క్రితం నర్సంపేటలో జరిగిన ఘటనలో వైఎస్ షర్మిల గాయం అయిందని టీవీలో చూపారు.. మరి తీరా నిన్న టీవీలలో చూస్తే ఆ గాయం మాయమైపోయిందంటూ ట్రోల్‌ చేశారు. వారు ఏ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారో తెలంగాణ పజలకు చెప్పాలని ఎద్దేవ చేశారు. ఈ రోజు వైఎస్ షర్మిల తెలంగాణ గవర్నర్ ని కలిశారు.

Read also: PM Narendra Modi: వారు రాముడిని ఎప్పుడూ నమ్మరు.. నన్ను తిట్టడంలో పోటీ పడుతున్నారు.

నేను గవర్నర్ కి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను.గాయం ఎంమైందో ఒక్కసారి షర్మిలను అడగండని ఆయన పేర్కొన్నారు. తెలంగాణనీ ఒక ఆఫ్గనిస్తాన్ తో వారు పోల్చారని గుర్తు చేశారు. అంటే ఒక గవర్నర్ గా మీరు తెలంగాణకి ఉన్నారా? లేక ఆఫ్గనిస్తాన్ కా? అంటూ ప్రశ్నించారు. మీరు తెలంగాణ గవర్నర్ గా కచ్చితంగా స్పందించాలని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రిని ఒక తాలిబాన్ గా పోల్చడాన్ని ఒక రాష్ట్ర గవర్నర్ గా మీరు సమర్థిస్తారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మొన్న మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లనే మహిళల దగ్గర నుండి రియాక్షన్ వచ్చిందని స్పష్టం చేశారు. మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వ్యక్తిగత విషయాలు తీయకుండా ప్రజా సమస్యల మీద రోజు పాదయాత్రలు చేసుకోండని తెలిపారు. మళ్లీ మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ ప్రజల నుండి తిరుగుబాటు తప్పదని అన్నారు. ఇలాంటి డ్రామాలు మరొకసారి చేయద్దని మిమ్మల్ని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.
Top Headlines- @ 1 PM: టాప్‌ న్యూస్‌