MLA Seethakka: డబ్బులతో ఓట్లు కొంటున్న బీజేపీ, టీఆర్ఎస్‌లకి బుద్ధి చెప్పాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Seethakka Requests Munugode People To Vote Palvai Sravanthi: ఓట్ల కోసం నోట్లు కురిపిస్తోన్న బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే సీతక్క మునుగోడు ప్రజల్ని కోరారు. ఎన్నికల కోసం కోట్లు ఖర్చు పెట్టేందుకు వాళ్ల దగ్గర డబ్బులున్నాయి గానీ.. గుంతలు పడ్డ రోడ్లను రిపేర్ చేయలేకపోతున్నారని, ప్రజల సమస్యల్ని తీర్చడం లేదని విమర్శించారు. పెట్టిబడిదారులకు రుణాలు మాఫీ చేసిన బీజేపీ.. పేదల నిత్యావసరాల ధరలు పెరగకుండా చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు. పాల్వాయి స్రవంతిని గెలిపించి అసెంబ్లీకి పంపితే.. తామిద్దరం సమ్మక్క, సారక్కల్లా ప్రజా సమస్యలపై పోరాడతామని అన్నారు. మునుగోడు అనేది పోరాటాల గడ్డ, త్యాగాల అడ్డా అని పేర్కొన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని దామెర గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో.. ఆమె పై విధంగా మాట్లాడారు.
అంతకుముందు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పాల్వాయి స్రవంతికి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. ఆమె రక్తం ధారపోసయినా.. మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుందని పేర్కొన్నారు. మునుగోడులో ఓటు లేని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలా? అని ప్రశ్నించారు. మునుగోడులో ఊరు లేని ఆయన తన ఓటు కూడా వేసుకోలేడని, అలాంటి వ్యక్తికి ఎందుకు ఓటు వేయాలని నిలదీశారు. దామెర గ్రామ సర్పంచ్ యాదగిరిని ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త స్ఫూర్తిగా తీసుకోవాలని.. నమ్మిన జెండా కోసం, ఆయన అమ్ముడుపోకుండా నిలబడి ఉన్నాడని అన్నారు. తాను పేదరికంలో ఉన్నప్పటికీ.. పార్టీ కోసమే నిలబడటం నిజంగా గొప్ప విషయమని కొనియాడారు. ఏ పార్టీ అయితే రాజగోపాల్ రెడ్డిని పోషించిందో, ఆ కాంగ్రెస్‌నే ఆయన మోసం చేశారని మండిపడ్డారు. తమ కాంగ్రెస్ అభ్యర్థిని 30 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు.
Also Read
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
- Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
తాజావార్తలు
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!