NTV Telugu Site icon

MLA Sanjay Kumar: భోగ శ్రావణి రాజీనామా.. స్పందించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్

Mla Sanjay Kumar

Mla Sanjay Kumar

MLA Sanjay Kumar: జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీనిపై జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ స్పందించారు. తన నిర్ణయం తనకు చాలా బాధ కలిగించిందని చెప్పుకొచ్చారు. మేము తండ్రీ కూతుర్లులా కలిసి ఉండేవారిమని తెలిపారు. మంచి భవిష్యత్తు ఉందని చాలాసార్లు చెప్పానని అన్నారు. గత కొన్ని నెలలుగా చైర్మన్ పై కౌన్సిలర్లు అసంతృప్తిగా ఉన్నా సయోధ్య కుదర్చారన్నారు ఆయన. ఇటీవల కౌన్సిలర్లు ట్రస్ట్‌ అంశాన్ని తెరపైకి తెచ్చినా తిరస్కరించారన్నారు. ఈ విషయాన్ని కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ రమణ, జిల్లా బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే విద్యా సాగర్ రావు దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. నేను స్వయంగా చైర్ పర్సన్ భోగ శ్రావణికి ఫోన్ చేసి బుధవారం ఉదయం కౌన్సిలర్ల సమన్వయ సమావేశం ఏర్పాటు చేశామని చెప్పినా.. హాజరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భోగ శ్రావణి ప్రెస్ మీట్ పెట్టి ఇలా చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు.

Read also: Revanth Reddy: కేసీఆర్ ని దారిలోకి తెస్తా అన్న ఈటెల.. ఇప్పుడు కేసీఆర్ దారిలోనే..

నిన్న జగిత్యాల మున్సిపల్ ఛైర్పర్సన్ పదవికి బోగ శ్రావణి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతరం మీడియా ముందు కంటతడి పెట్టారు శ్రావణిచైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రశ్నించడంతోనే ఎమ్మెల్యే అడుగడుగునా ఇబ్బందులు గురి చేస్తున్నాడని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యే వేధింపులు భరించలేక పోతున్నానని, మీకు పిల్లలు ఉన్నారు. వ్యాపారాలు ఉన్నాయి జాగ్రత్త అని బెదిరిస్తున్నాడని.. డబ్బులు కోసం డిమాండ్ చేసారని, మేము ఇచ్చుకోలేం అని చెప్పామని దొర అహంకారంతో బీసీ బిడ్డ ఎదుగుతుందని ఓర్వలేక నాపై కక్ష గట్టారన్నారు. అన్ని పనులకు అడ్డొస్తూ చెప్పకుండా ఎలాంటి అభివృద్ధి పనులు చేయవద్దని హుకుం జారీ చేసాడని, మున్సిపల్ చైర్మన్ పదవి నరక ప్రాయంగా మారిందన్నారు శ్రావణి.

Read also: Balakrishna: నాకు 60 సంవత్సరాలు అంటే వాడికి దబిడి దిబిడే

ఎమ్మెల్సీ కవితను కలవకూడదని, కేటీఆర్ పేరు ప్రస్థావించకూడదు అని హుకుం జారీ చేశారని శ్రావణి ఆవేదన వ్యక్తం చేసింది. నరకయాతనకు గురి చేసాడని, ఆశీర్వదిస్తూ ఎమ్మెల్సీ కవిత ఇంటికి వస్తే వేధింపులు ఎక్కువ చేసేవాడని, ఎమ్మెల్యేతో మాకు ఆపద ఉందని ఆమె వ్యాఖ్యానించారు. మా కుటుంబానికి ఏమైనా జరిగితే సంజయ్ కుమార్ కారణం అవుతారని, రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీకి వేడకున్నారు. నడి రోడ్డుపై అమరవీరుల స్థూపం సాక్షిగా అవమానానికి గురయ్యానని, ఎన్ని అవమానాలు చేసినా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్ళానన్నారు. ఎమ్మెల్యేతో పోలిస్తే మున్సిపల్ చైర్మన్ పదవి చిన్నది అంటూ అవమానం చేశారని, స్నేహితుడి కోసం జంక్షన్ చిన్నగా కట్టిన వ్యక్తి ఎమ్మెల్యే అని ఆమె వెల్లడించడంతో ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
Sharwanand: ఘనంగా శర్వానంద్ నిశ్చితార్థం.. రామ్‌చరణ్ దంపతులు హాజరు