జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీనిపై జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ స్పందించారు. తన నిర్ణయం తనకు చాలా బాధ కలిగించిందని చెప్పుకొచ్చారు. మేము తండ్రీ కూతుర్లులా కలిసి ఉండేవారిమని తెలిపారు. మంచి భవిష్యత్తు ఉందని చాలాసార్లు చెప్పానని అన్నారు.