MLA Ramesh Babu Satires On BJP Congress Parties: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మునిగిపోయిన పడవలంటూ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు సెటైర్లు వేశారు. రాజన్న సిరిసిల్లాలో ఆయన మాట్లాడుతూ.. 2016లోనే 55 వేల ఎకరాలకు సాగు నీరు అందించడం జరిగిందని స్పష్టం చేశారు. లక్ష ఎకరాలకు వేములవాడ నియోజకవర్గం సాగునీరు అందిస్తోందని తెలియజేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పూర్తిగా విఫలం అవ్వడం వల్లే.. బీఆర్ఎస్ ఏర్పాటు అయ్యిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు సైనికుడిగా పని చేయాలని పిలుపునిచ్చారు. నాలుగోసారి వేములవాడ నియోజకవర్గంపై బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Boinapally Vinod Kumar: పుట్టగతులు ఉండవనే.. బీజేపీ, కాంగ్రెస్ విమర్శలు చేస్తున్నాయి
తనకు వ్యాపారాలు లేకపోయినప్పటికీ.. తాను జర్మనీకి వెళ్లి తొమ్మిది ఒప్పందాలు చేసుకొని వచ్చానని ఎమ్మెల్యే రమేశ్ బాబు తెలిపారు. కలికోట సూరమ్మ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని, వేములవాడ దేవాలయ అభివృద్ధిపై కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని తెలియజేశారు. ముంపు గ్రామాల సమస్యను తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయితే.. బుడ్డర్ ఖాన్ రేవంత్ రెడ్డి ఇక్కడికొచ్చి ఏదేదో మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. దేనికైనా ఒక లిమిట్ ఉంటుందని సూచించారు. చేసేదేమీ లేదు కానీ, చేసే వాళ్లను కూడా ముప్పులు తిప్పలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ బామ్మర్ది వినోద్ కుమార్‌ని ఎంపీగా గెలిపిద్దామని ఆయన పిలుపునిచ్చారు.
Harish Rao: తమిళనాడు తరహాలో రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్నాం
ఇదిలావుండగా.. వేములవాడలో రూ.100 కోట్ల కుంభకోణం జరిగిందని ఇటీవల రమేశ్ బాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. కొందరు అడ్డగోలుగా భూములు కబ్జాలు చేసుకున్నారని, ఆ విషయాలను త్వరలోనే బహిర్గతం చేస్తానని కూడా వెల్లడించారు. ఈ వ్యవహారంలో సొంతపార్టీ నేతలున్నా వదలబోనని హెచ్చరించడంతో.. జోరుగా చర్చలు సాగాయి. కొందరు తుపాకీ, మైనింగ్ లైసెన్సులు తీసుకొని రాజ్యమేలాలని చూస్తున్నారని.. అగ్రహారం గుట్టలు, నందికమాన్ ప్రాంతంలో భూములను విచ్చలవిడిగా కబ్జా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలతో స్థానికంగా ఆందోళనలు రేకెత్తాయి.