Site icon NTV Telugu

ఈటలకు రాజాసింగ్‌, రఘునందన్‌ పరామర్శ.. మళ్లీ పాదయాత్ర..!

Rajasingh

Rajasingh

హుజురాబాద్‌ నియోజకవర్గంలో పాదయాత్రలో అస్వస్థతకు గురైన బీజేపీ నేత ఈటల రాజేందర్‌… వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు.. పాదయాత్ర ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్టు ఈటల ప్రకటించారు.. మరోవైపు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈటలను ఇప్పటికే పలువురు నేతలు పరామర్శించగా.. ఇవాళ బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్‌, రాఘునందర్‌రావు పరామర్శించారు.. ఆయన ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఇక, ఆస్పత్రిలో ఈటలను పరామర్శించిన తర్వాత మీడియాకు ఓ వీడియో విడుదల చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్… ఈటల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందన్న ఆయన… ఆస్పత్రి నుంచి రేపు ఈటల డిశ్చార్జ్‌ అవుతారని తెలిపారు. త్వరలోనే పూర్తిస్థాయిలో కోలుకొని తిరిగి ఈటల తన పాదయాత్రను ప్రారంభిస్తారని వెల్లడించారు రాజాసింగ్.. అంతేకాదు.. ప్రజల ఆశీర్వాదంతో హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో మళ్లీ ఈటల రాజేందర్‌ గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.

Exit mobile version