Site icon NTV Telugu

Raja Singh : అసద్‌.. మనసులో ఒకటి… నోటి నుంచి వచ్చింది ఒకటి

సరూర్‌ నగర్‌లో ఇటీవల జరిగిన హత్య గురించి.. ముస్లిం యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగరాజును హత్య చేయడంపై ఖండిస్తున్నట్లు ఒక మీటింగ్ లో అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. అయితే దీనిపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మాట్లాడుతూ.. ముస్లిం అమ్మాయి.. హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఇంట్లో నుంచి బహిష్కరిస్తే బాగుండేది.. కానీ అలా మర్డర్ చేయడం బాగోలేదని ఓవైసీ అన్నాడని, కానీ ఇదంతా షోకుటాప్ ముచ్చట్లే అంటూ మండిపడ్డారు. అసద్‌ మనసులో ఉంది ఒకటి… నోటి నుంచి వచ్చింది ఒకటి అంటూ మండిపడ్డారు. నాగరాజును హత్య చేసిన వ్యక్తిని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేపట్టి ఉరిశిక్ష వేయించాలని ఓవైసీ మాట్లాడితే బాగుండేదన్నారు.

అంతేకాకుండా ఓవైసీ, ఎస్సీ కమిషన్‌ను, సంఘాల నేతలను నేనొక్కటే కోరుతున్నా.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి నాగరాజును హత్య చేసిన వారు ఎంత మంది ఉన్నా అందరికీ ఉరిశిక్ష వేయాలని రాజాసింగ్‌ కోరారు. న్యాయవాదులు నిందితుల తరుపున బెయిల్ కూడా ఇవ్వొదని, ఎవరూ కేసును వాదించవద్దని కోరుతున్నానన్నారు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులకు ఉరిశిక్ష పడాలని, అప్పుడే ఇతరులు భయపడుతారు. మరోసారి ఇలాంటి పరిస్థితి జరగడానికి అవకాశం ఉండదని రాజాసింగ్‌ వ్యాఖ్యానించారు.

Exit mobile version