MLA Raghunandan Rao fire on CM KCR: 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆవిష్కరించారు. గణతంత్ర దినోత్సవం రోజున రాజ్యాంగానికి భిన్నంగా సిఎం కెసిఆర్ పరిపాలన చేయడం బాధాకరమన్నారు. గవర్నర్ ను, బీజేపీ పార్టీని వ్యతిరేకిస్తున్నామనుకునే మీ నిర్ణయాల వల్ల జాతీయ జెండాను అవమానం జరుగుతుందని పేర్కొన్నారు. సర్వోన్నత న్యాయ స్థానం పరేడ్ గ్రౌండ్ లో జెండా వేడుకలు నిర్వహించాలనే మాటను సీఎం తుంగలో తొక్కారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో గవర్నర్ తో జెండా వేడుకలు జరపవద్దనే జిల్లాల్లో రద్దు చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ లో ఇంతగా రాజకీయాలను దిగజార్చడం బాధాకరం.. ఈ అవమానం జాతీయ జెండాకు చేసినట్టే అన్నారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మార్చి ఖమ్మంలో బహిరంగ సభ పెడితే కరోనా పాండమిక్ ఉండదా?రేపు మీ పుట్టిన రోజు సందర్భంగా సచివాలయం ప్రారంభిస్తామనుకుంటే కరోనా రాదా? అంటూ ప్రశ్నించారు ఆయన. గణతంత్ర దినోత్సవ వేడుకలపై తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
Read also: Republic Day 2023: ఇది సంక్షేమ ప్రభుత్వం.. 3 రాజధానుల అంశాన్ని ప్రస్తావించని గవర్నర్..!
రాజ్‌భవన్ లో గణతంత్ర వేడుకలకు గవర్నర్ తమిళిసై హాజరయ్యారు. అనంతరం గవర్నర్ తమిళి సై.. సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. రాజ్‌భవరన్ లో జాతీయ పతాకావిష్కరణ చేశారు. ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశం మనది అన్నారు. మేధావులు, మహాన్నత వ్యక్తులు మన రాజ్యాంగం రూపొందించారన్నారు. రాజ్యాంగ రచనలో అంబేడ్కర్ ఎంతో అంకితభావం కనబరిచారన్నారు. వైద్య, ఐటీ రంగాల్లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. శాతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్ ఎన్నో రంగాల్లో దూసుకుపోతోందని తెలిపారు. తెలంగాణ ఘనమైన, విశిష్టమైన చరిత్ర ఉందన్నారు గవర్నర్. రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిందని తెలిపారు. రాజ్యాంగ్య రచనలో అంబేడ్కర్ ఎంతో అంకితభావం కనబరిచారని, మేధావులు, మహోన్నత వ్యక్తులు మన రాజ్యంగం రూపొందించారని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశం మనదని తెలిపారు.
Basara Temple: బాసర అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి