NTV Telugu Site icon

CBI: ఎమ్మెల్యేల ఎర కేసు.. సీబీఐ ఢిల్లీ విభాగానికి అప్పగింత..

Cbi

Cbi

CBI: సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణ జరుపుతుండగా.. దానిని సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టు సింగిల్‌ బెంజ్‌ ఆదేశాలు జారీ చేసింది.. అయితే, ఈ పరిణామాన్ని హైకోర్టు ధర్మాసనం ముందు సవాల్‌ చేశారు.. దీనిపై ఇవాళ వాదనలు హాట్‌హాట్‌గా సాగాయి.. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది హైకోర్టు.. మరోవైపు.. ఈ కేసు విచారణ కోసం సీబీఐ ఉత్సాహంగా ఉన్నట్టు తెలుస్తోంది.. ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐ ఢిల్లీ విభాగానికి అప్పగించారు.. ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తు చేయాలని సీబీఐ డైరెక్టర్‌ను హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. దర్యాప్తు బాధ్యతలను ఢిల్లీ విభాగానికి అప్పగించారు సీబీఐ డైరెక్టర్.. దీంతో, హైదరాబాద్‌కు వచ్చింది సీబీఐ ఢిల్లీ ఎస్సీ నేతృత్వంలోని బృందం..

Read Also: Congress and BRS Alliance: బీఆర్ఎస్‌తో పొత్తుకు కాంగ్రెస్‌ అంగీకారం తెలిపిందట..! మేం ఎప్పుడో చెప్పాం..

ఎమ్మెల్యేల కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను సిట్ నుంచి తమకు ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌కు లేఖ రాసింది సీబీఐ.. అయితే, ఈ రోజు వాదన సమయంలో.. సీబీఐ వాదనలు కూడా వింటామని తెలిపిన హైకోర్టు.. సోమవారం వరకు కేసు పైళ్ల కోసం ఒత్తిడి చేయవద్దని సీబీఐకి తెలిపింది.. ప్రభుత్వ అప్పీలుపై సోమవారం స్పష్టత వచ్చాక ఎఫ్‌ఐఆర్‌ నమోదు యోచనలో సీబీఐ ఉన్నట్టుగా తెలుస్తోంది. కాగా, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశామని హైకోర్టుకు తెలిపింది సీబీఐ.. ఈ వ్యవహారంలో ఇప్పటికే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా.. తమకు ఎలాంటి డాక్యుమెంట్లు ఇవ్వలేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లింది.. డాక్యుమెంట్లు ఇస్తే.. విచారణ ప్రారంభిస్తామని హైకోర్టుకు తెలిపింది సీబీఐ.. దీంతో.. కేసు విచారణ పూర్తయ్యే వరకు ఆగాలని సీబీఐకి సూచించింది ధర్మాసనం.. ఇదే సమయంలో.. సీబీఐ వాదనలు కూడా వింటామన్న హైకోర్టు… తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.. ఈ కేసులో సోమవారం కూడా వాదనలు కొనసాగనున్నాయి.. సీబీఐ వాదనలు కూడా విననుంది హైకోర్టు.. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐ విచారణకు అప్పగిస్తూ సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును హైకోర్టు ధర్మాసనం సమర్థిస్తుందా..? తీర్పు మరో రకంగా రానుందా? అనే ఉత్కంఠ నెలకొంది.

Show comments