తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి జడ్చర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పర్యటన కొనసాగుతుంది. అభివృద్ధి సంక్షేమాన్ని అందిస్తున్న కేసీఆర్ సర్కార్ కి మద్దతు తెలుపాలని కోరుతూ సంక్షేమ పథకాలను ఆరా తీస్తూ ముందుకు సాగుతున్నారు. కాగా..కాంగ్రెస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. అభివృద్ధిని వైపే మా అడుగు అంటూ నిరంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జరుగుతున్నాయి.
బాలానగర్ మండలం హెమాజిపుర్ గ్రామానికి చెందిన 100 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ 25 రోజులు మీరు పని చేయండి వచ్చే 5 ఏండ్లు నేను పనిచేస్తానని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ మరొకసారి తనను లక్ష మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరారు. రేపు నవంబర్ 30వ తేదినా జరుగబోయే ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని లక్ష మెజారిటీ తో గెలిపించాలని లక్ష్మారెడ్డి ప్రజలను కోరారు. ప్రచారంలో భాగంగా.. ఇవాళ నవాబుపేట మండలం అమ్మాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పర్యటించారు.
ప్రజలతో మమేకమై బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని వివరిస్తూ సాగుతున్నారు. కొద్దిరోజుల క్రింతం.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన 150 మంది నాయకులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు చంద్రప్రకాష్ రెడ్డి, రామకృష్ణరెడ్డి, సిద్ధిరాంరెడ్డి, ఆంజనేయులు.. కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలకి చెందిన నాయకులందరికి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా.. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి అమ్మాపూర్ గ్రామం తరుపున పూర్తి మద్దతునిస్తూ కారుగుర్తుకు ఓటువేసి లక్షఓట్ల మెజారిటీతో గెలిపిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఇక తాజాగా.. తండాకు చెందిన కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు రవీందర్, వార్డు సభ్యులు రాజేశ్వరి, శ్రీనివాస్, రమేష్ సహా 100 మంది నాయకులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. నూతనంగా చేరిన వారందరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నూతన సభ్యులు మాట్లాడుతూ బీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి పూర్తి మద్దతునిస్తూ కారు గుర్తుకు ఓటువేసి లక్షఓట్ల మెజారిటీతో గెలిపిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
Naga Chaitanya: బీస్ట్ మోడ్ లోకి మారిపోయాడు… వర్కౌట్స్ చూస్తే మతి పోవాల్సిందే