Bhatti vikramarka: కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ముదిగొండ మండలం, మధిర నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.. తెలంగాణలో అధికారంలోకి రావడానికి మాయమాటలు చెప్పి, అనేక వాగ్దానాలు చేసిన కేసీఆర్,ఆయన కుటుంబం, బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల సంపదను దోపిడీ చేసి ఖజానాను లూటీ చేశారన్నారు. కాబట్టే తెలంగాణ వచ్చే పది సంవత్సరాలు అవుతున్న ప్రజల జీవితాల్లో వెలుగులు రాలేదన్నారు. బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో పరిశ్రమలు, ప్రాజెక్టులు ప్రజల జీవన భృతి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకపోవడానికి బిఆర్ఎస్ ప్రభుత్వం పాల్పడిన దోపిడీనే కారణమన్నారు.
తెలంగాణ ప్రజల కలలు నిజం చేయడానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ప్రజల కలలను కల్లలుగా మార్చిన బిఆర్ఎస్ ప్రభుత్వం అని మండిపడ్డారు. ప్రజల తెలంగాణ ఏర్పాటు ద్వారానే తెలంగాణ ప్రజలు కన్నటువంటి కలలు, ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు. ప్రజల సంపద ప్రజలకే పంచడానికి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలను తీసుకువచ్చిందన్నారు. సీఎల్పీ నాయకుడిగా భట్టి విక్రమార్కనైనా నేను, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇద్దరం కలిసి గ్యారెంటీ కార్డులపై సంతకాలు చేసి మా పార్టీ కార్యకర్తల ద్వారా ప్రతి ఇంటింటికి పంపిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో మేము సంతకాలు చేసి పంపించిన గ్యారెంటీ హామీ పత్రంలో ఉన్న అన్ని గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రజలందరూ బాగుపడాలన్నదే కాంగ్రెస్ ధ్యేయమన్నారు. కులమత రాజకీయాలకతీతంగా అందరి అభివృద్ధి చేసేటువంటి కాంగ్రెస్ ను ఎన్నికల్లో గెలిపించాలన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు బిఆర్ఎస్ ప్రభుత్వం వారి పార్టీ వాళ్లకు మాత్రమే ఇస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బిజెపి, బీఆర్ఎస్, సిపిఎం అన్ని పార్టీల కార్యకర్తలకు 6 గ్యారంటీలను ఇస్తామన్నారు. దొరల వద్ద తాబేదారులు ఉన్నటువంటి వారిని గెలిపించుకుంటే నియోజకవర్గం అభివృద్ధి జరగదన్నారు. దొరల వద్ద వంగి వంగి దండాలు పెట్టే తాబేదర్ కావాలా? ప్రజలను పాలించే నాయకుడు కావాలా? ప్రజల సంపద ప్రజలకే పంచిపెట్టే కాంగ్రెస్ పార్టీ కావాలా? ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. మైనార్టీలకు నాలుగు శాఖ రిజర్వేషన్ కల్పించింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. దేశంలో లౌకికవాదాన్ని నిలబెట్టి మైనార్టీలకు రక్షణగా నిలుస్తున్నది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. దేశంలో హిందూ, ముస్లిం భాయి, భాయి అంటూ సోదర భావాన్ని పెంచి పోషిస్తున్నది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు.
లౌకికవాదానికి కట్టుబడి ఉన్న కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటేనే దేశంలో మైనార్టీలకు రక్షణ దొరుకుతుందన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వం అని మండిపడ్డారు. డిగ్రీలు, పీజీలు, ఉన్నత చదువులు చదివిన యువత ఉద్యోగాలు రాకపోవడంతో ఉపాధి హామీ పనులకు, భవన నిర్మాణ పనులకు వెళ్తున్నారంటే ఈ పాలకులు సిగ్గుపడాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు. ప్రశ్న పత్రాలు లీకేజీ లేకుండా TSPSC ద్వారా పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ దేశ భవిష్యత్తు యువకులదే వారి భవిష్యత్తుకు కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ ఇస్తుందన్నారు.
Raviteja: ది ఈగల్ ఈజ్ కమింగ్…