MLA Lakshmareddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జడ్చర్ల పట్టణంలోని నిమ్మబాయిగడ్డ ప్రాంతంలో బీఆర్ఎస్ అభ్యర్థి జడ్చర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాలను ఆరా తీశారు. తాగునీళ్లు సక్రమంగా అందుతున్నాయా కరెంటు ఇబ్బంది ఏమైనా ఉందా? రోడ్లు డ్రైనేజీ వసతి ఎలా ఉంది? అని ఇంటింటికి తిరుగుతూ అడిగి తెలుసుకున్నారు.
అవ్వను, తాతలను ఆడబిడ్డలను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రచారం కొనసాగించారు. గల్లి గల్లిలో లక్ష్మారెడ్డికి బొట్టు పెట్టి మహిళలు హారతులు పట్టారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి ప్రతి ఒక్కరికి తెలంగాణ ప్రభుత్వం రానున్న ఐదేళ్లలో చేపట్టే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు పథకాల గురించి వివరించారు. సౌభాగ్యలక్ష్మీ పథకం కింద గృహిణులకు నెలకు మూడు వేల రూపాయలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
ఇంతటి అభివృద్ధి సంక్షేమాన్ని అందిస్తున్న కేసీఆర్ సర్కార్ కి మద్దతు తెలుపాలని కోరారు. రేపు నవంబర్ 30వ తేదినా జరుగబోయే ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని లక్ష మెజారిటీ తో గెలిపించాలని ప్రజలను కోరారు.
Lakshma Reddy
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజల్లో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని ప్రచారం చేసుకుంటు ముందుకు సాగుతున్నారు. నిన్న మాదారం గ్రామంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి స్థానిక మండల నాయకులతో కలిసి పర్యటించారు. తొమ్మిదిన్నర ఏళ్లలో ప్రతి గ్రామానికి ట్రాక్టర్ కేటాయిస్తూ, ప్రతిరోజు చెత్తను సేకరిస్తూ, డ్రైనేజీలు సిసి రోడ్లు ఏర్పాటు చేసి గ్రామాల రూపు రేఖలు మార్చామని తెలిపారు.
పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, సెగ్రిగేషన్ షెడ్లు ఏర్పాటుచేసి అంటువ్యాధులు ప్రబలకుండా గ్రామాలను కాపాడుకుంటున్నామని తెలిపారు. కనీసం 7 గంటల కరెంటు కూడా సక్రమంగా సరఫరా చేయకుండా అన్నదాతలను ఆగం చేసిన గత ప్రభుత్వాలు కావాలా? నిరంతరంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందజేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం కావాలా? అని రైతులు ఒక్క క్షణం ఆలోచించుకోవాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కోరారు.
Balayya: బిగ్ బాస్ సీజన్ 8కి నట సింహం హోస్టింగ్?