ఒకప్పుడు నందమూరి బాలకృష్ణ అంటే ఫాన్స్‌ని కొడతాడు, ఫోన్స్ విసిరేస్తాడు… ఇలా ఏవేవో కామెంట్స్ వినిపించేవి. ఇప్పుడు బాలయ్య అనే పేరు వినగానే అందరికీ థింకింగ్ మారిపోతుంది. జై బాలయ్య అనేది ఒక స్లోగన్ ఆఫ్ సెలబ్రేషన్ అయ్యింది. ఆహాలో అన్‌స్టాపబుల్ టాక్ షో ఎప్పటి నుంచి చేస్తున్నారో అప్పటి నుంచే బాలయ్యపై ఉన్న నెగిటివిటి తగ్గి, కంప్లీట్ పాజిటివ్ ఒపీనియన్ వచ్చింది. దెబ్బకి థింకింగ్ మారిపోవాలా అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన అన్‌స్టాపబుల్ షో నిజంగానే బాలయ్య పట్ల ఉండే థింకింగ్‌ని పూర్తిగా మార్చేసింది. ఈ టాక్ షోలో గత రెండు సీజన్స్ లో బాలయ్యని చూసిన వాళ్లు, ఇన్ని రోజులు మనం వినింది ఇతని గురించేనా? బాలయ్య ఇంత సరదాగా ఉంటాడా? అంత స్పాంటేనియస్‌గా పంచులు వేస్తాడా? చిన్న హీరోలు అనే తేడా లేకుండా అందరితో ఇంత ఫ్రెండ్లీగా మాట్లాడుతాడా? అని స్వీట్ షాక్‌కి గురయ్యారు. లేటెస్ట్ గా స్టార్ట్ అయిన అన్ స్టాపబుల్ సీజన్ 3 లిమిటెడ్ ఎడిషన్ కూడా సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.
సీజన్ 3 లిమిటెడ్ ఎడిషన్ మాత్రమే కాబట్టి త్వరగానే కంప్లీట్ చేసిన బాలయ్య… ఇండియాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ని హోస్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడట. తెలుగులో ఎన్టీఆర్ స్టార్ట్ చేసిన బిగ్ బాస్ షోకి సెకండ్ సీజన్ నాని హోస్టింగ్ చేసాడు. మూడో సీజన్ నుంచి ప్రస్తుతం జరుగుతున్న ఏడో సీజన్ వరకూ కింగ్ నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. మధ్యలో ఎవరెవరో పేర్లో వినిపించినా కూడా నాగార్జున మాత్రమే కంటిన్యూ అవుతున్నాడు. లేటెస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 8కి మాత్రం బాలయ్య హోస్ట్ గా వ్యవహరించనున్నాడు అనే వార్త సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. సీజన్ 7యే బాలయ్య చెయ్యాల్సింది, అది మిస్ అయ్యి ఇప్పుడు సీజన్ 8ని హోస్ట్ చేస్తున్నాడు అంటూ ఒక న్యూస్ వైరల్ అవుతోంది. బాలయ్య టైమింగ్ కి, ఎవరైనా తప్పు చేస్తే ఆయనకి వచ్చే కోపానికి బిగ్ బాస్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది. మరి ఈ సీజన్ 8 హోస్టింగ్ విషయంలో బాలయ్య ఉన్నాడా లేక నాగార్జుననే కంటిన్యూ చేస్తాడా అనే విషయంలో ఎవరు క్లారిటీ ఇస్తారు అనేది చూడాలి.