Site icon NTV Telugu

MLA Jeevan Reddy : ప్రతి పక్షాల చిన్న మెదడు చితికి పోయింది

TRS MLA Jeevan Reddy Countered to BJP and Congress Leaders statements.

తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. నేడు మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగునున్నాయి. అయితే రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్‌ ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. దీనిపై ప్రతిపక్ష నేతలు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అయితే ప్రకటన మాత్రమే చేశారు.. ఇంకా నోటిఫికేషన్‌లు ఇవ్వలేదని.. సంబరాలు చేసుకుంటున్నవారికి పిచ్చి ముదిరిందంటూ వ్యాఖ్యానించారు. అయితే ప్రతి పక్షాల మాటలకు ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. కేసీఆర్ అంటే కొలువులు, చదువులు, రూపాలు అని ఆయన అన్నారు.

తెలంగాణ రాదని చెప్పారు కానీ తీసుకొచ్చింది కేసీఆర్ అని, కాళేశ్వరం కట్టలేరు అన్నారు కానీ కేసీఆర్ కట్టి చూపించారన్నారు. లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కేసీఆర్ ఇచ్చారని, ప్రతి పక్షాలు చిన్న మెదడు చితికి పోయింది ఈ దెబ్బ తో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేసీఆర్ అంటే ఒక చరిత్ర.. కేసీఆర్ ఒక సూపర్ స్టార్ అని ఆయన కొనియాడారు. రేవంత్ రెడ్డి మెదడు దొబ్బిందని, కేసీఆర్ టీఆర్ఎస్ మోసపూరిత పార్టీ అంటున్నాడు రేవంత్ అని, వారిని నమ్మి నిరుద్యోగులు మోసపోకండని ఆయన అన్నారు. నేను ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తానని, చక్కగా చదువుకోండి అంటూ ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీ అనుబంధ సంస్ధల నిరుద్యోగులు ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అయి జాబులు తెచ్చుకోండని వెల్లడించారు.

Exit mobile version