MLA Jagga Reddy : ఆనాడు ఎర్రబెల్లి.. కేసీఆర్‌ను ఊరికించి కొడుతాననలేదా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేను అప్పుడు ఇప్పుడు సమైక్యవాదినే అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పత్రికా ప్రకటనను విడుదల చేశారు. కేసీఆర్‌ని బట్టలు ఇప్పి కొడుతానన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ మీ టీఆర్‌ఎస్ ప్రభుత్వ క్యాబినెట్ లో మంత్రే కదా.. ఉద్యమంలో కేసీఆర్ ఊరికించి కొడుతానన్న ఎర్రబెల్లి దయాకర రావు ఇప్పుడు మీ ప్రభుత్వ క్యాబినెట్ లొనే ఉన్నాడు కదా.. మంత్రి పువ్వడా అజయ్ కుమార్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు నికర్సైనా స్వమైక్యవాదులే కదా.. ఉద్యమ సమయంలో టీఆరెస్ కార్యకర్తలను ఊరికించి కొట్టిన దానం నాగేందర్ ఇప్పుడు టీఆర్‌ఎస్‌లోనే ఉన్నాడు కదా అంటూ ఆయన లేఖలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చాక కూడా ఇంకా మీ పరిపాలనలో ఆంధ్ర కాంట్రాక్టర్ లే కదా పని చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఇది మీకు సిగ్గు అనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు.
మరొక్కసారి మాట్లాడితే మీ మొత్తం చరిత్ర చెప్తానని ఆయన హెచ్చరించారు. అంతేకాకుండా మా కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, మా కాంగ్రెస్ పార్టీ ఓయూ నాయకులు నీ సంగతి చూసుకుంటారులే అంటూ బాల్క సుమన్‌కు వార్నింగ్ ఇచ్చారు. రాహుల్ గాంధీని పదే పదే ఓయూ కి రావొద్దని మాట్లాడుతున్నారని, నువ్వు ఎవడివి, నీ పార్టీ ఏంది.. రాహుల్ గాంధీని ఓయూ కి రావొద్దు అనడానికి అంటూ ఆయన ధ్వజమెత్తారు. మొన్నే చెప్పిన కదా ఓయూ మీ అయ్యా జగిరా అని.. నువ్వు రాహుల్ గాంధీ పట్ల మాట్లాడినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి.
Also Read
- Revanth Reddy: హజ్ యాత్రికులకు అండగా ఉంటాం.. యాత్రను ప్రారంభించిన రేవంత్‌రెడ్డి
- CM Revanth Reddy : దేశానికే మోడల్‌గా కొడంగల్.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
- Tragedy : హైదరాబాద్‌లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
- Jupally Krishna Rao : తుమ్మిడిహెట్టి పునరుద్ధరణే ధ్యేయం.. బీఆర్ఎస్ వైఫల్యాలే రైతులకు శాపం
ఈ రోజే క్షమాపణ చెప్పాలి లేకపోతే రేపు మా యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, ఓయూ కాంగ్రెస్ నేతలు నీ ఇంటి ముందు కూర్చొని నీతో క్షమాపణ చెప్పిస్తారన్నారు. నీ మొగతనం ఏంటో రేపు మా వాళ్ళు తెలుస్తారు.. రేపు మా వాళ్ళు వస్తారు.. బుధవారం మే 4 వ తేదీన నేను మినిస్టర్ క్వాటర్స్ కి వస్తున్న.. కేసీఆర్‌ని ముఖ్యమంత్రి హోదలో ఉస్మానియా యూనివర్సిటీకి తీసుకుపోలేని మీలాంటి దద్దమ్మలు టీవీ లో మాట్లాడుతారా అంటూ ఆయన అగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
-
YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
-
Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!
-
CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
-
Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!