Site icon NTV Telugu

Harish Rao: ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది.. కేసీఆర్‌ సర్జరీ పై హరీష్ రావు

Harish Rao

Harish Rao

Harish Rao: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను పరామర్శించేందుకు ఎవరూ ఆస్పత్రికి రావద్దని మాజీ మంత్రి హరీశ్‌రావు అభిమానులకు విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కాగా, కేసీఆర్‌ను పరీక్షించిన వైద్యులు తుంటి ఎముక విరిగినట్లు గుర్తించారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కేసీఆర్ ఇవాళ సాయంత్రం తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోనున్నారు. కేసీఆర్ కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాలు పడుతుందని హరీశ్ రావు అన్నారు. సర్జరీ సమయంలో ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఎవ్వరూ ఆస్పత్రికి రావద్దని కోరుతున్నానని తెలిపారు. కేసీఆర్ కు విశ్రాంతి అవసరమన్నారు.

Read also: Vijay Rashmika: విజయ్-రష్మికల రిలేషన్ పై ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో క్లారిటీ!

కేసీఆర్ ను చూసేందుకు కార్యకర్తలు, అభిమానులు ఎవ్వరూ ఆస్పత్రికి రావద్దని కోరుతున్నానని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్‌ను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. దురదృష్టవ శాత్తు జరిగిన ప్రమాదానికి పెద్ద శస్త్రచికిత్స అవసరమవుతుందని తెలిపారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని బీఆర్‌ఎస్‌ కుటుంబ సభ్యులతో పాటు ప్రార్థిస్తున్నామని తెలిపారు. దీనిపై ఎమ్మెల్సీ కవిత ట్వీట్ కూడా తెలిపిన విషయం తెలిసిందే. ఇక మరోవైపు కేసీఆర్ ఆరోగ్యంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ గాయం గురించి విని చాలా బాధపడ్డానని తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

Exit mobile version