Site icon NTV Telugu

దేశంలో ఇలాంటి పరిస్థితి ఎక్కడా లేదు: ఈటల

BJP MLA Etela rajender

కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బదిలీలు అంటూ 317 జీవోను తీసుకువచ్చి ఉద్యోగులను ఆత్మహత్యలు చేసుకునేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ఉద్యోగులతో చర్చించకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని, నెటివిటీ లేక ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు అని పార్టీల నాయకులు చెప్పిన వినకుండా కేసీఆర్ మొండి వైఖరి అవలంభిస్తున్నారని విమర్శించారు.

ఈ జీవోతో ఉద్యోగులు ఇబ్బందులకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ నర్సంపేట వాసి ఉప్పుల రమేష్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం టీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. దేశంలో ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటన ఎక్కడ లేదు. ఉద్యోగాల సంఘాలతో చర్చించి వెంటనే ఈ జీవోను రద్దు పరిచి వారికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉప్పుల రమేష్ కుటుంబానికి బీజేపీ పార్టీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. రమేష్ కుటుంబానికి ఆర్దిక సహాయంగా రూ. 50 వేలను ఈటల రాజేందర్ అందజేశారు.

Exit mobile version