టీఎస్ఎంఎస్ఐడీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎర్రోళ్ల శ్రీనివాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఎస్ఎంఎస్ఐడీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరణ కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మగా అద్భుతంగా పని చేశారు. ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణలో కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు వైద్య సదుపాయాలు కల్పించే కీలకమైన సంస్థ టీఎస్ ఎం ఎస్ ఐడీసీ, అలాంటి సంస్థకు ఛైర్మగా బాధ్యతలు స్వీకరిస్తున్న ఎర్రోళ్ల శ్రీను కు నా అభినందనలు అని వైద్యాఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులలో బిల్డింగ్ లు, మెడికల్ డివైసెస్, ఎక్స్ రేలు, టెస్టింగ్ ల్యాబ్ లు, ఇంజక్షన్లు, బెడ్లు మాత్రమే ఆస్పత్రుల్లో కనిపిస్తాయి. కాని అవి సమకూరడానికి శ్రమించేది, సమకూర్చేది టీఎస్ఎంఎస్ఐడీసీ సంస్థనే సమకూరుస్తుందన్నారు.
ఆస్పత్రుల భవన నిర్మాణా పనులు, అవసరమైన ఫర్నిచర్, మందులు, సర్జికల్ ఎక్విప్మెంట్, వైద్యానికి అవసరమైన కాటన్, డయాగ్నస్టిక్ ఎక్విప్మెంట్స్, మెడికల్ ఎక్విప్మెంట్ నిర్వహణ, శానిటైజెషన్, ఆస్పత్రుల భద్రతకు అవసరమైన సెక్యూరిటీ ఏర్పాట్లు, వైద్యో ఆరోగ్య శాఖకు అవసమరైన అన్ని సదుపాయాలు కల్పించేది ఈ సంస్థ ద్వారానే అందిస్తుందన్నారు.మహబూబ్ నగర్, సిద్దిపేట జిల్లాల్లో మెడికల్ కాలేజీలు టీఎస్ఎంఎస్ఐడీసీ నిర్మించిందని పేర్కొన్నారు. సిరిసిల్లలో నర్సింగ్ కాలేజీని నిర్మించింది. ఎం.ఎన్. జే క్యాన్సర్ ఆసుపత్రిలో మాడ్యులర్ థియేటర్ నిర్మాణ పనులు ఈసంస్థ ద్వారానే జరుగుతున్నాయన్నారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్తు కు సంబంధించిన 14 ఆస్పత్రుల అప్ గ్రేడేషన్, 83 ఆస్పత్రులను బలోపేతం చేయడం లో ఈ టీఎస్ఎంఎస్ఐడీసీ కీలకంగా పని చేసింది. 19 హబ్ అండ్ స్పోక్ మోడల్ డయాగ్నోస్టిక్ సేవలు అందించే కేంద్రాలు, 8 మినీ హబ్ లను హైదరాబాద్ లో ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. మొత్తం రూ. 150 కోట్లతో వివిధ ఆసుపత్రుల్లో అత్యాధునిక సిటీ, ఎంఆర్ఐ, పిఈటీ స్కాన్ మిషషన్ ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.
Also Read
Read Also: హయత్ నగర్‌లో ఒమిక్రాన్ కలకలం
గుండె సమస్యలున్న వారిని కాపాడుకునేందుకు గాంధీ, ఉస్మానియా, నిమ్స్, ఎంజీఎంలలో, ఖమ్మం, ఆదిలాబాద్ ఆసుపత్రుల్లో విలువైన క్యాథ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసుకుంటున్నాం. టీఎస్ఎంఎస్ఐడీసీ ద్వారా వీటన్నింటిని సమకూర్చుకుంటున్నాం. ఆరోగ్య తెలంగాణ గా తెలంగాణ రాష్ట్రం మారాలన్నది సీఎం కేసీఆర్ గారి కల. పేషంట్లకు త్వరిత గతిన ఆరోగ్య పరీక్షలు, మందులు అందించే ఒక గొప్ప బాధ్యత ఇప్పుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ మీద ఉంది. తను చురుకుగా ఉండి, తన సంస్థను మరింత ముందుకు సమర్థవంతంగా నడుపుతూ, వందకు వంద శాతం తన బాధ్యతలను నిర్వర్తించి కేసీఆర్ గారి నమ్మకాన్ని నిలబెట్టాలని ఆశిస్తున్నాని హరీష్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఎర్రోళ్ల శ్రీనివాస్ సీఎం కేసీఆర్‌కు, మంత్రి హరీష్ రావుకు , కేటీర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
తాజావార్తలు
-
Teachers Day 2026: ఉపాధ్యాయులతో ప్రధాని మోడీ సంభాషణ.. టీచర్స్ డే సందర్భంగా కీలక సందేశం
-
Teachers Day Special: టీచర్ అంటే జీవితాన్ని మార్చేవాడు! తెలుగు తెరపై గురువును గుర్తుచేసే మూడు గొప్ప సినిమాలు
-
Gold and Silver Prices Today: మరోసారి బంగారం ధరల పతనం.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే..
-
Trump: ట్రంప్ దేనికో భయపడుతున్నాడు? 50 మంది సైనిక అధికారులకు పాలిగ్రాఫ్ పరీక్షలు!
-
Ampere Magnus G Max: ఆంపియర్ మాగ్నస్ జి మ్యాక్స్.. 142KM రేంజ్.. 65KM స్పీడ్.. 34 లీటర్ల స్టోరేజ్!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!