NTV Telugu Site icon

Vemula Prashanth Reddy: దేశం మొత్తం కేసీఆర్‌ను పొగుడుతోంది.. అసలు బీజేపీ ఏం చేసింది..?

Vemula Prashanth Reddy

Vemula Prashanth Reddy

Vemula Prashanth Reddy: బీజేపీ, బీఆర్ఎస్‌ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.. ఆరోపణలు, విమర్శల పర్వంలో రెండు పార్టీలు దూకుడు చూపిస్తున్నాయి… బీఆర్ఎస్‌ను, సీఎం కేసీఆర్‌ను టార్గెట్‌ చేసి బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు విమర్శలు గుప్పిస్తుంటే.. అదే రేంజ్‌లో కౌంటర్‌ ఎటాక్‌కు దిగుతున్నారు బీఆర్ఎస్‌ నేతలు.. తాజాగా, బీజేపీ పాలిత రాష్ట్రాలు, ఆ పార్టీ నేతలపై ప్రశ్నల వర్షం కురపించారు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి.. దేశం మొత్తం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును పొగుడుతుంటే.. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ అనే సన్నాసి మాత్రం కేసీఆర్‌ని తిడుతున్నారని ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు.. దేశం మొత్తం కేసీఆర్‌ను పొగుడుతుంటే బీజేపీ మాత్రం కేసీఆర్‌ను తిట్టడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

Read Also: Human Composting : మనుషుల మృతదేహాల నుంచి ఎరువులు.. వినడానికే కొత్తగా ఉంది కదూ

ఇక, 24 రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం ఆయా రాష్ర్టాల్లో ఒక్క అభివృద్ధి పథకాలను చేయడం లేదని ఆరోపించారు ప్రశాంత్ రెడ్డి.. ఆయా రాష్ర్టాల్లో పెన్షన్‌లు ఇవ్వడం చాత కాదు.. లక్ష రూపాయలు కూడా కళ్లాలకు ఇవ్వడం చేతకాదు, పది వేల పెట్టుబడి కూడ ఇవ్వలేని బీజేపీ.. ఇక్కడ మాత్రం కేసీఆర్‌ని ఇష్టం వచ్చినట్లుగా తిడుతున్నారని ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, కేంద్ర నిధులు నుంచి, అప్పుల వరకు అన్ని విషయాల్లో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం నడుస్తోన్న విషయం విదితమే.