N. Uttam Kumar Reddy: నేడు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు మంత్రి ఉత్తమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
N. Uttam Kumar Reddy: మేడిగడ్డ సహా కాళేశ్వరం ప్రాజెక్టు డ్యామ్‌లపై వ్యవహారంపై జస్టిస్ పీసీ ఘోష్ విచారణ కమిషన్.. రాష్ట్ర ప్రభుత్వం తమ తదుపరి కార్యాచరణ వేగవంతం చేయనున్నాయి. జస్టిస్ పీసీ ఘోష్ విచారణ కమిషన్ ఇవాళ, శనివారం అన్నారం, సుందిళ్ల డ్యామ్‌లను కూడా పరిశీలించనుంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు క్షేత్రస్థాయిలో మరమ్మతులు, రక్షణ చర్యలను పరిశీలించనున్నారు. ఇంజినీర్లతో కలిసి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల వద్ద జరుగుతున్న పనులను పరిశీలించనున్నారు. ఇంజినీర్లతో పాటు నిర్మాణ సంస్థల ప్రతినిధులు కూడా పురోగతిని సమీక్షిస్తారు. మేడిగడ్డ బ్యారేజీలో మరో రెండు గేట్లను ఎత్తారు. 7వ బ్లాక్‌లో CSMRS గ్రూప్ పరీక్షలు జరుగుతున్నాయి.
Read also: Manamey Twitter Review : శర్వానంద్ ఆడియన్స్ ను ఇంప్రెస్స్ చేసాడా..?
Also Read
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
- Alwal Case: అల్వాల్ మైనర్ బాలిక సామూహిక లైంగిక దాడి కేసులో షాకింగ్ ట్విస్ట్..
- CM Revanth Reddy : రేపు సీఎం రేవంత్ టూర్.. కరీంనగర్, సిరిసిల్లలో భారీ కార్యక్రమాలు
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ మధ్యంతర నివేదికలో చేసిన సిఫారసులకు అనుగుణంగా మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల డ్యామ్‌ల వద్ద మరమ్మతులు, రక్షణ చర్యలకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. మేడిగడ్డ బ్యారేజీలో ముఖ్యమైన గేట్ల ఎత్తివేత పనులు కొనసాగుతున్నాయి. ఏడో బ్లాక్‌లోని ఎనిమిది గేట్లలో ఇప్పటికే ఒక గేట్ ఎత్తివేయగా, కుంగిపోయిన పైర్ల మధ్యలో ఉన్న గేటును కోసి తొలగిస్తున్నారు. మిగిలిన ఆరు గేట్లలో గురువారం రెండింటిని తెరిచారు. 16, 17 గేట్లను ఎత్తివేసినట్లు ఇంజినీర్లు తెలిపారు. గతంలో మేడిగడ్డ 16వ గేటు తెరిచే సమయంలో సాంకేతిక సమస్యలతో ఆగిపోయి అంతా సర్దుకుని గురువారం ఎత్తివేశారు. మరో నాలుగు గేట్లను కూడా తెరవాల్సి ఉంది. వాటిని కూడా అదే విధంగా ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Read also: Delhi: నకిలీ ఆధార్ తో పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించేందుకు యత్నం.. ముగ్గురు కూలీల అరెస్ట్
ఆనకట్ట వద్ద గ్రౌటింగ్‌తో సహా షీట్ ఫైల్స్, సీసీ బ్లాక్‌ల మరమ్మతులు కొనసాగుతున్నాయి. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు సీఎస్‌ఎంఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మేడిగడ్డ బ్యారేజీ వద్ద పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు అన్నారం, సుందిళ్ల వద్ద పనులన్నీ కొనసాగుతున్నాయి. విచారణ కమిషన్‌కు ప్రజల నుంచి 54 ఫిర్యాదులు అందాయి. వాటిని పూర్తిగా పరిశీలించి, ఆధారాలను పరిశీలించిన తర్వాత సమన్లు జారీ చేస్తారు. కమిషన్‌కు సహకరించేందుకు ఏర్పాటైన టెక్నికల్ కమిటీ కూడా ఇప్పటికే మేడిగడ్డ ఆనకట్టను పరిశీలించింది. అక్కడి పరిస్థితులు, జరిగిన నష్టం, మరమ్మతు పనులు, రక్షణ చర్యలు తదితర అంశాలను పరిశీలించారు. కమిటీ సభ్యులు తమ పరిశీలనలను జస్టిస్ పీసీ ఘోష్‌కు వివరిస్తారు.
Babar Azam Record: చరిత్ర సృష్టించిన బాబర్ ఆజమ్.. విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్!
తాజావార్తలు
-
Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
-
Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
-
RBI FD Rules 2026: బ్యాంకు ఎఫ్డీలపై ఆర్బీఐ కొత్త రూల్స్.. ప్రతీ రోజు వడ్డీ రేట్లు వెల్లడించాల్సిందే..
-
Rohit-Kohli Records: గువాహటిలో రో-కో రికార్డుల జాతర.. దిగ్గజాల ఖాతాలో ఎన్నో ప్రత్యేకతలు!
ట్రెండింగ్
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?