Site icon NTV Telugu

Talasani : మాకు ప్రజలతో పొత్తులు… సింగిల్‌గానే పోటీ చేస్తాం..

తెలంగాణలో మరోసారి పొత్తుల వ్యవహారం హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.. దానికి ప్రధాన కారణం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ అనే చెప్పాలి… ఓవైపు తెలంగాణలో టీఆర్ఎస్‌ పార్టీకి వ్యూహాలు రచిస్తున్న పీకే.. కాంగ్రెస్‌ పార్టీలో చేరతారని ప్రచారం గట్టిగానే సాగుతోంది.. కొందరు సీనియర్ నేతల మాటలు చూస్తుంటే.. పీకే కాంగ్రెస్‌ కండువా కప్పుకోవడం గ్యారెంటీ అనిపిస్తోంది. ఇదే సమయంలో.. తెలంగాణలో కూడా టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య పొత్తు ఉంటుందని..! ఏకంగా కాంగ్రెస్‌ పార్టీలో టీఆర్ఎస్‌ విలీనం కాబోతోందంటూ కథనాలు వెలువడ్డాయి.. దీనిపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్.. ఈ పరిణామాలపై క్లారిటీ ఇచ్చారు.

Read Also: Supreme Court: అతిపెద్ద సమస్యగా మారిన అక్రమ లేఅవుట్లు..!

మాకు ప్రజలతో పొత్తులు ఉంటాయి.. టీఆర్ఎస్‌ సింగిల్ గానే పోటీ చేస్తుంది.. రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు పొత్తులు అవసరం లేదని స్పష్టం చేశారు తలసాని శ్రీనివాస్‌ యాదవ్.. ఇక, బీజేపీ మాకు పోటీనే కాదు.. వాళ్లు ఎక్కువ ఊహించుకుని మాపై మాట్లాడుతున్నారని సెటైర్లు వేశారు.. మాకు ఎవరితోనూ పొత్తులు ఉండవు అని పదే పదే చెబుతున్నాం.. రెండు సార్లు అధికారంలోకి వచ్చాం.. ఎవరితో పొత్తు పెట్టుకున్నాం..? అని ప్రశ్నించారు. మతాలను అడ్డుపెట్టుకొని దేశాన్ని బీజేపీ విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించిన తలసాని.. ఎన్నికల వ్యూహకర్త పీకే చర్చలకు.. కాంగ్రెస్, బీజేపీ వాళ్లు మాట్లాడుతున్నదానికి సంబంధం లేదన్నారు.

Exit mobile version