Srinivas Goud: రేవంత్ రెడ్డికి కులం పిచ్చి.. బీజేపీ కి మతం పిచ్చి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేవంత్ రెడ్డికి కులం పిచ్చి.. బీజేపీ కి మతం పిచ్చి.. అంటూ కాంగ్రెస్, బీజేపీ నాయకులపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. పాలమూరు స్టేడియం గ్రౌండ్ లో 40 లక్షల అభివృద్ధి పనులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ లో నారాయణపేట అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని ఆగ్రహం వక్తం చేశారు. తెలంగాణ వచ్చాక పూర్వ వైభవం తెస్తున్నామని తెలిపారు. జిల్లా కేంద్రంగా మార్చామని గుర్తు చేశారు. తెలంగాణాలో ఏ అభివృద్ధి పని జరుగుతున్నా.. ఇక్కడ నారాయణ పేటలో ఏర్పాటు చేస్తున్నామని మంత్రి అన్నారు. ఇప్పుడు జిల్లా ఆసుపత్రి.. త్వరలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.
ఇంతటి అభివృద్ధి పనులు జరుగుతుంటే.. రెండు జాతీయ పార్టీల నాయకులకు దయ్యం పట్టినట్లు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఒక్కనాడు వాళ్ళ కులం వాళ్లకు ఏమీ చేయని నేత అని నిప్పులు చెరిగారు. ఎవరి ఓట్లతో ప్రజా ప్రతినిధిగా గెలిచినవంటూ ఎద్దేవ చేశారు. బండి సంజయ్ ఏమి మాట్లాడుతాడో ఎవ్వరికీ తెలియదు.. కేవలం సీఎం కేసీఆర్ ను తిట్టుకుంటూ తిరగడం తప్ప చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలను గుజరాత్ వ్యాపారులకు అమ్ముకుంటున్నారని మండిపడ్డారు.
Also Read
- Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
- 22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
- Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
- Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్‌పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
Bonalu Festival: ఈ నెల 30 నుంచి.. భాగ్యనగరంలో బోనాల జాతర షూరు..
తాజావార్తలు
-
Weather Update: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు తీవ్ర గాయం.. రేపే సర్జరీ!
-
Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
-
Teacher Suspended: విద్యార్థినులతో లీలలు.. ప్రభుత్వ టీచర్ సస్పెండ్..
-
IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..