Minister Seethakka : మహిళల సంక్షేమం, సాధికారత పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, వివేక్‌ల సహకారంతో తెలంగాణ మహిళల అభ్యున్నతికి అనేక పథకాలు అమలు చేస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. సీతక్క మాట్లాడుతూ.. “కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల సంక్షేమాన్ని కోరే పార్టీ. ఇందిరమ్మ కాలంలోనే మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశారు. ఉక్కుమహిళగా నిలిచిన ఇందిరా గాంధీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మ – ఇద్దరూ మహిళల సాధికారతకు ప్రతీకలు” అని అన్నారు.
H-1B visa: ట్రంప్ H-1B వీసా నిబంధనలతో ఎవరిపై ప్రభావం .? ఎవరిపై ఉండదు..?
“గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో మహిళా సంఘాలు ఏర్పడ్డాయి. నేడు ప్రతి ఏడాది 25 వేల కోట్ల బ్యాంకు రుణాలు మహిళలకు ఇస్తున్నాం. ఆ రుణాలతో మహిళలు పెట్రోల్ బంకులు, శక్తి క్యాంటీన్లు, సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. మహిళల ద్వారా నడిచే వ్యాపారాలు కోట్లలో ఆదాయాన్ని రాబడుతున్నాయి” అని సీతక్క వివరించారు. నారాయణపేట మహిళా సంఘం ఆరు నెలల్లోనే 13.80 లక్షల ఆదాయం సంపాదించిందని చెప్పారు. హైదరాబాద్ నగరంలో 35 ఇంద్ర మహిళా శక్తి క్యాంటీన్లు మహిళల ద్వారానే నడుస్తున్నాయని తెలిపారు.
అంతేకాకుండా.. “ఉచిత బస్సు ప్రయాణమే కాకుండా మహిళా సంఘాలను ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులుగా చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాల యూనిఫామ్‌లు కూడా మహిళా సంఘాల ద్వారానే కుట్టిస్తున్నారు. దీంతో వారికి ఏటా 30 కోట్ల ఆదాయం వస్తోంది. మహిళా సంఘ సభ్యుల కోసం 10 లక్షల ప్రమాద బీమా, రెండు లక్షల లోన్ బీమా కల్పించాం. ఇప్పటి వరకు 40 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లించాం” అని వివరించారు. “బీఆర్‌ఎస్ మహిళలతో దుర్మార్గంగా వ్యవహరించింది. మహిళల 1,800 కోట్ల పొదుపు డబ్బులను కూడా మింగేసింది. నాసిరకం బతుకమ్మ చీరలు ఇచ్చి మహిళలను అవమానపరిచింది.
ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం పై తప్పుడు వీడియోలు సృష్టించి మోసం చేయాలని చూస్తోంది. బతుకమ్మ పండుగను రాజకీయాలతో కలుషితం చేస్తోంది. మహిళలు ఇకపై మోసపోవద్దు” అని ఆమె పిలుపునిచ్చారు. “కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలని సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి మహిళా సంఘం ద్వారా వడ్డీ లేని రుణాలు అందిస్తూ ఆర్థికంగా నిలబెడతాం. మహిళలు బలంగా ఉంటే కుటుంబం బలంగా ఉంటుంది, దేశం బలంగా ఉంటుంది. కాబట్టి మహిళలందరూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీవించాలి” అని సీతక్క అన్నారు.
India vs Pakistan: ఎందుకంత భయం..? భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ కొత్త వ్యూహం..
