తెలంగాణ రాష్ట్రంలో మహిళా శక్తి బలోపేతానికి ప్రభుత్వం పూర్తి అండగా నిలుస్తుందని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన మహిళా సమాఖ్యల సమావేశంలో ఆమె కీలక ప్రసంగం చేశారు.
మహిళల సంక్షేమం, సాధికారత పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, వివేక్‌ల సహకారంతో తెలంగాణ మహిళల అభ్యున్నతికి అనేక పథకాలు అమలు చేస్తున్నామని ఆమె స్పష్టం చేశారు.
అంగన్వాడీలు ఈనెల 11న తెరుచుకోనున్నాయని, అంగన్వాడీల్లో చిన్నారులు చేరేలా చర్యలు చేపట్టండని కలెక్టర్లకు మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు. శిధిలావస్తలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను సమీపంలోని ఖాళీ ప్రభుత్వ భవనాల్లోకి మార్చండని సూచించారు. కొత్తగా వెయ్యి అంగన్వాడీ భవనాలు నిర్మించబోతున్నామని, వాటికి కావాల్సిన స్థలాలను సేకరించండని చెప్పారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యునిఫామ్‌లను మహిళా సంఘాలచే కుట్టిస్తున్నామని, పాఠశాల తెరిచే రోజు విద్యార్థులందరికి యునిఫామ్‌లు పంపిణీ చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. సచివాలయంలో మంత్రి సీతక్క,…
కోటి మంది మహిళలను ఆర్థికంగా బలంగా చేయడానికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. ప్రతి మహిళను స్వయం సహాయ సంఘాల్లో చేర్చే దిశగా అధికారులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు.