Site icon NTV Telugu

Seethakka Mulugu tour: ములుగు జిల్లాలో సీతక్క పర్యటన.. షెడ్యూల్‌ ఇదే..

Seetakka

Seetakka

Seethakka Mulugu tour: ములుగు జిల్లాలో రాష్ట్ర పంచాయితీ రాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు దనసరి అనసూయ సీతక్క పర్యటన ఖరారైంది. ఇవాళ ములుగు మండలం జాకారం గ్రామ పంచాయతీ పరిధిలోని గట్టమ్మ ఆలయాన్ని ఉదయం 10 గంటలకు సందర్శించి పూజలు.. అనంతరం మధ్యాహ్నం 3:00 గంటలకు మేడారం జాతర 2024కి సంబంధించి జిల్లా యంత్రాంగంతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.

షెడ్యూల్ ఇదే..

* ఉదయం 6:00 గంటలకు హైదరాబాద్ ఎమ్మెల్యే క్వటర్స్ నుండి రోడ్డు మార్గాన బయలుదేరుతారు

* ఉదయం 9:15 గంటలకు ములుగు మండలం లోని మహమ్మద్ గౌస్ పల్లి కి చేరుకుంటారు

* ఉదయం 9:45 మహమ్మద్ గౌస్ పల్లి చేరుకుంటారు

* అక్కడి నుండి రోడ్డు మార్గాన ఉదయం 10:15 ములుగు గట్టమ్మ దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు

*  ఉదయం 11:30 గంటలకు ములుగు గట్టమ్మ నుండి రోడ్డు మార్గాన ర్యాలీ నిర్వహిస్తారు

* మధ్యాహ్నం 1:30 తాడ్వాయి మండలం లోని మేడారం సమ్మక్క సారలమ్మ వన దేవత లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు

* మధ్యాహ్నం 2:30 కి భోజనం విరామం ఉంటుంది.

*  మధ్యాహ్నం 3:00 గంటలకు జిల్లా అధికార యంత్రాంగం తో మేడారం జాతర రివ్యూ మీటింగ్

* సాయంత్రం 4:30 to 6:00 కి ఆదివాసి భవన్ మేడారంలో ప్రెస్ మీట్

* సాయంత్రం 7: 30 గంటలకు ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బస చేస్తారు.

Darshan: కాటేరా ట్రైలర్ ఊరమాస్ గా ఉంది…

Exit mobile version