Minister Seethakka: రైతు రుణ మాఫీ ఏక కాలంలో చేసిన ఘనత కాంగ్రెస్ దే అని మంత్రి సీతక్క అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా కొమురం భీం జిల్లాలో ఆమె మాట్లాడుతూ పీఎం మోడీపై మండిపడ్డారు. మోడీ వచ్చి అబద్ధాలు.. చెబుతున్నారని తెలిపారు. వాళ్ళు పదేళ్లు అధికారంలో ఉండి ప్రజా సమస్యలు పట్టించుకో లేదన్నారు. బీజేపి, బీఆర్ఎస్ వాళ్ళు తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఓట్ల కోసం హిందూ ముస్లిం కొట్లాటలు పెట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం రక్షించ బడాలంటే కాంగ్రెస్ గెలవాలన్నారు. రైతు రుణ మాఫీ ఏక కాలంలో చేసిన ఘనత కాంగ్రెస్ దే అన్నారు. అయోధ్య గురించి మాట్లాడే మోడీ రాజ్యాంగం పై ఎందుకు వివక్ష? అని ప్రశ్నించారు.
Read also: Zero Shadow day: ఈరోజు హైదరాబాద్ లో జీరో షాడో డే.. ఎన్నిగంటలకో తెలుసా..?
బీజేపీ పార్టీ 10 సంవత్సరాల నుండి అధికారంలో ఉన్న ఈ ప్రాంతానికి ఏం చేయలేదని నష్టమే చేసింది కానీ ఏమి చేయలేదని నిన్న నిర్మల్ జిల్లా లోకేశ్వరంలో జరిగిన సమావేశంలో అన్నారు. ఈ ప్రాంతానికి కేంద్ర విశ్వవిద్యాలయం ఇస్తామని ఇవ్వలేదు ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ మీదుగా రైల్వే లైన్ ఇవ్వలేదని ఆమె మండిపడ్డారు. తెరిపిస్తామన్న సిమెంట్ ఫ్యాక్టరీని ఇప్పటికీ తెరిపించలేదని తెలిపారు. రాబోయే కాలంలో రాజ్యాంగాన్ని మార్చేసి బడుగు బలహీన వర్గాల పేదలను మరింత పేదలుగా మార్చే ఆలోచనలో ఉన్నారని తెలిపారు. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకే మోడీ సపోర్ట్ ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడక్కడ కొందరు మిల్లర్ల యాజమాన్యాలు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని, అలా ఓవరాక్షన్ చేయకూడదని ఏమున్న కొనుగోలు కేంద్రం దగ్గరనే మాట్లాడి కానీ లారీలలో ధాన్యం రైస్ మిల్లర్ దగ్గరికి తీసుకెళ్లి కటింగ్ చేస్తున్నారని మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ కుమార్ ఆదేశించారని అన్నారు. ఈ ఆకల వర్షానికి ధాన్యం తడిచిన పూర్తి మద్దతు ధర ఉంటుందని మంత్రి సీతక్క తెలిపారు.
INDIA Alliance: ఎన్నికల కమిషన్ తో నేడు ఇండియా కూటమి నేతల సమావేశం