Sabitha Indra Reddy: హైదరాబాద్ లో ఎల్ కేజీ బాలికపై లైంగిక వేధింపులు సంచళంగా మారింది. ఈ ఘటనపై విద్యాశాఖ సీరియస్ అయ్యింది. ఎల్ కేజీ బాలికపై లైంగిక వేధింపులకు కారణమైన బంజారాహిల్స్ లోని బిఎస్ డి డిఏవి పాఠశాల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలనీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లా విద్యా శాఖాధికారిని ఆదేశించారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేలా పక్కనే ఉన్న పాఠశాలల్లో సర్ధుబాటు చేయాలని సూచించారు.
Read also: Badulgula Lingaiah Yadav: నడ్డ సమాధి కట్టింది ప్రజలు టీఆర్ఎస్ కాదు
ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రుల సందేహాలను నివృత్తి చేసే బాధ్యత పూర్తిగా జిల్లా విద్యా శాఖ అధికారిదేనని మంత్రి తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన భద్రతా పరమైన చర్యలను ప్రభుత్వానికి సూచించేందుకు విద్యా శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కమిటీలో పాఠశాల విద్యా శాఖ సంచాలకులు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి, పోలీస్ విభాగంలో మహిళల భద్రతను పర్యవేక్షిస్తున్న డిఐజి స్థాయి అధికారులు సభ్యులుగా ఉంటారని మంత్రి తెలిపారు. ఈ కమిటీ తన నివేదికను వారం రోజుల్లోగా అందిస్తుందని పేర్కొన్నారు. ఈ నివేదిక ఆధారంగా విద్యార్థుల భద్రతకు సంభందించి ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసే బాధ్యతపై ఆయా పాఠశాలల యాజమాన్యాల నుంచి హామీపత్రం తీసుకునే విధంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు.
ఈనెల 19న (బుధవారం) ఎల్‌కేజీ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు డ్రైవర్ రజనీకుమార్. ఈ ఘటన తెలిసిన వెంటనే తల్లిదండ్రులు ఆగ్రహానికి గురయ్యారు. డ్రైవర్‌ను కొట్టి పోలీసులకు అప్పగించారు కుటుంబ సభ్యులు. డీఏవీ స్కూల్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు. లైంగిక దాడి కేసులో డ్రైవర్ రజిని కుమార్ తో పాటు ప్రిన్సిపాల్ మాధవిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు మాధవిపై కేసు నమోదయింది. ఇద్దరిని కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు పోలీసులు. గత పన్నెండేళ్ళుగా ఇదే స్కూళ్ళో క్లీనర్ గా, డ్రైవర్ గా పని చేస్తున్నాడు రజినీకుమార్.
T20-world-cup: సూపర్ 12లోకి ఐర్లాండ్.. ఇంటిదారి పట్టిన వెస్టిండీస్